విజయవాడ దుర్గగుడి లో నకిలీ సర్టిఫికెట్లు కలకలం రేపుతున్నాయి. దుర్గగుడి లో పనిచేస్తున్న ఇద్దరు ఆలయ ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్ల తో పదోన్నతి పొందారు. తాజాగా అధికారుల విచారణలో నకిలీ సర్టిఫికెట్లు బాగోతం బయటపడింది. దుర్గగుడిలో రికార్డు అసిస్టెంట్ గా పని చేస్తున్న రాజు జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణులు నకిలీ సర్టిఫికెట్ల తో పదోన్నతి పొందినట్లు గుర్తించి వారిని సస్పెండ్ చేసారీ ఆలయ ఈఓ. సస్పెండ్ చేసిన ఆ ఇద్దరు పైన కేసు నమోదు చేసే అవకాశం […]
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ము పప్పుబెల్లాల్లా పంచుతోంది. జగన్ రైతులను గాలికొదిలేశారు. వ్యవసాయాన్ని తుంగలో తొక్కారు అని కన్నా లక్ష్మి నారాయణ అన్నారు. రైతులు మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం అమ్ముకుంటున్నారు. సేకరించిన ధాన్యానికి డబ్బులు సక్రమంగా చెల్లించడం లేదు. మద్దతు ధర కోసం మూడు వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ మరిచిపోయారు. డ్రిప్ ఇరిగేషన్ గురించి పట్టించుకోవటం లేదు అని తెలిపారు. అనేక వ్యవసాయ పరికరాలపై కేంద్రం […]
కరోనా ఆర్‌టిపిసిఆర్ పరిక్షలు చేస్తామంటూ ఘరానా మోసం చేసారు. ఇండియా మార్ట్ లోఫోన్ నంబర్ తో లాగిన్ అయిన హైదరాబాద్ పాత బస్తీకి చెందిన వ్యక్తి కి ఆర్‌టిపిసిఆర్ టెస్ట్ లు చేస్తామని సైబర్ నేరగాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. తన ఇంట్లో పది మంది ఉన్నారని తెలిపాడు బాధితుడు. అతని దగ్గర నుండి డెబిట్ కార్డ్ వివారలు అడిగి ఓటిపి తీసుకున్నారు నేరగాళ్ళు. ఆ ఖాతాలో ఉన్న మొత్తం 2.94లక్షలు కాజేసారు నేరగాళ్ళు. దాంతో హైదరాబాద్ […]
కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ జరగడం లేదు. కృష్ణపట్నంకి ఎంత దూరం నుంచి వచ్చిన మందు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. సర్వేపల్లి నియాజక వర్గంలోని పొదలకూరులో నేడు ఆనందయ్య మందు పంపిణి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వాలెంటీర్ల ద్వారా మందు పంపిణీ జరుగుతుంది. పొదలకూరు మండలంలోని 30 పంచాయతీలకు రూట్ ఆఫిసర్ల ద్వార మందు తరలింపు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం కృష్ణపట్నంలో 144 సెక్షన్ కొనసాగుతుంది. కృష్ణపట్నం లో కి ఇతర ప్రాంతాల వారిని అనుమతించడం లేదు. ఆధార్ కార్డు […]
గుంటూరు సంగం డెయిరీ మార్కెటింగ్ మేనేజర్ శ్రీధర్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విజయవాడలో సంగం డెయిరీ పాలక మండలి సమావేశం నిర్వహించడంపై కేసు నమోదు చేసారు పోలీసులు. కేసు దర్యాప్తులో భాగంగా శ్రీధర్ ఇంటికి వెళ్లారు పటమట పోలీసులు. అయితే ఆ సమయంలో ఇంట్లో శ్రీధర్ లేకపోవడంతో 160 సిఆర్ పిసి కింద నోటీసు ఇచ్చారు పోలీసులు. నేడు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ కరోనా సమయంలో సమావేశం నిర్వహించడం కోవిడ్ […]
సైబర్ నేరగాళ్ళ కొత్త తరహా మోసం బయట పడ్డింది. సంస్థల వెబ్ సైట్ లో సిఈఓ మెయిల్ పేరుతో నకిలీ మెయిల్ తయారు చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. తెలంగాణ గనులు భూగర్భ శాఖ డైరెక్టర్ పేరుతో నకిలీ మెయిల్ పంపించారు. తాను మీటింగ్ లో ఉన్నానని.. అత్యవసరంగా 10 వేల రూపాలయల యామెజాన్ గిఫ్ట్ కార్డ్ పంపాలని క్రింది స్థాయి ఉద్యోగులకు మెయిల్ పంపారు. నిజమే అనుకుని గిఫ్ట్ కార్డ్ పంపారు నిజామాబాద్ గనుల శాఖ అధికారి. […]
రాజమండ్రి ఇసుక ర్యాంప్ వద్ద ఈ నెల 1న గోదావరిలో లభ్యమైన మూడు మృతదేహాల కేసులో మిస్టరీ వీడింది. సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెళ్లెల్లు, తమ్ముడు. తమ తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురై గోదావరిలో దూకి అత్మహత్య చేసుకున్నారు కుమార్తెలు, కుమారుడు. మృతులు ప.గో.జిల్లా కొవ్వూరు బాపూజీనగర్ కు చెందిన అక్క మామిడిపల్లి కన్నా దేవి (34) చెల్లెలు నాగమణి (32), తమ్ముడు దుర్గారావు (30) గా గుర్తించారు. […]
కరోనా వైరస్ ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కొత్తగా 86,498 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,96,473 కి చేరింది. ఇందులో 2,73,41,462 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 13,03,702 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 2123 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,51,309 కి చేరింది. ఇక ఇదిలా […]
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇదే సయమంలో మరో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ వెలువడింది. జులై 5 న లంకకు బయలుదేరనున్న భారత్ బి జట్టు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20 ల్లో పోటీ పడనున్నాయి. ఇందులో జులై 13న మొదటి వన్డే మ్యాచ్ అలాగే వరుసగా 16,18 న రెండు, […]
ఈరోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఇంటర్ పరీక్షలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. టేబుల్ ఐటమ్ గా ఇంటర్ ఎగ్జామ్స్ ఇష్యూ ఉంది. కొద్దిసేపటి క్రితమే అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వం ముందు ఉన్న ఆప్షన్స్… పరీక్షలు రద్దు చేసి ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఆధారంగా రిజల్ట్స్ ప్రకటించడం లేదా పరీక్ష సమయం తగ్గించి సగం ప్రశ్నలకే జులై […]