నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 12415 మంది భక్తులు దర్శించుకోగా 8046 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండి ఆదాయం 2.2 కోట్లుగా ఉంది. అయితే కరోనా అనంతరం దర్శనాల కుదింపు తరువాత శ్రీవారి హుండీ ఆదాయం రెండు కోటు దాటడం ఇది కేవలం మూడోసారి మాత్రమే. 20వ తేదిన ఆన్ లైన్ లో ఆగష్టు నెలకు సంభందించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. 30,31వ తేదిలో హనుంతుడి జన్మస్థలం […]
నేడు తెలంగాణలో జరగనున్న పాలిసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు అధికారులు. ఈ పరీక్షకు లక్ష 2వేల496 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 411 కేంద్రాలలో ఈ పరీక్షా జరగనుంది. ఉదయం 11 గంటల నుండి 1:30 వరకు పరీక్ష ఆఫ్లైన్(పెన్,పేపర్,పెన్సిల్)లో పరీక్ష జరగనుంది. అభ్యర్థులకు పది గంటల నుండే పరీక్ష హాల్ లోకి అనుమతించనున్నారు. 11 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం అయిన నో ఎంట్రీ అని స్పష్టం చేసారు. […]
మూడు రోజుల క్రితం వరకూ స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఇప్పుడు తిరిగి పెరగడం మొదలు పెట్టాయి. ఈ రోజు కూడా ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ.45,250కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి 49,370 కి చేరింది. గత మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతుండటంతో బంగారం […]
మేషం : ఆర్థిక లావాదేవీలు ఊహించిన విధంగానే ఉంటాయి. చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అభివృద్ధి కానరాగలదు. సోదరీ, సోదరులు, సన్నిహితులకు సంబంధించిన ఖర్చులు అధికం. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట తప్పదు. ఆహార వ్యవహారాలలో మెళకువ వహించండి. వృషభం : ధనాన్ని మంచి నీళ్ళప్రాయంగా ఖర్చు చేస్తారు. పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. రిప్రజెంటేటివ్‌లకు నెమ్మదిగా మార్పులు కానరాగలవు. వృత్తిపరమైన […]
అప్పులు అందులోని తప్పులపై వైసీపీ.. టీడీపీ మధ్య ఫైట్ జరుగుతోంది. పీఏసీ ఛైర్మన్ ఆరోపణల తర్వాత ఈ రగడ పీక్‌కు వెళ్లింది. ఇంతలో బీజేపీ ఎంపీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారా లేక.. రెస్క్యూకి వచ్చారా అన్నది ప్రశ్నగా మారింది. ఇంతకీ ఆ కమలనాథుడి లేఖ ఆంతర్యం ఏంటి? గవర్నర్‌కు బీజేపీ ఎంపీ జీవీఎల్ రాసిన లేఖపై చర్చ! ఏపీ ఆర్థిక వ్యవహారాలపై గవర్నర్‌ను కలిసి PAC ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఫిర్యాదు చేసిన […]
నెల్లూరు జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జిందాల్ స్టీల్ ప్లాంటుకు 860 ఎకరాల కేటాయించారు. నెల్లూరు జిల్లా తమ్మినపట్నం- మోమిడి గ్రామాల పరిధిలో జిందాల్ స్టీల్ ప్లాంటుకు భూమి ఇచ్చారు. గతంలో కిన్నెటా పవర్ కు ఇచ్చిన భూ కేటాయింపులు రద్దు చేసి.. జిందాల్ స్టీల్సుకు కేటాయించారు. రూ. 7500 కోట్ల రూపాయలతో 11.6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయనుంది జిందాల్ స్టీల్స్. 2500 మందికి నేరుగా, మరో 15 […]
ఆ నాయకుడి రాజకీయ భవిష్యత్ ఎక్కే మెట్టు దిగే మెట్టుగా మారిందా? కొత్త నిర్ణయం కలిసి వస్తుందా? ఉన్నచోట ఎందుకు ఇమడ లేకపోయారు? కొత్త పార్టీలో ఎదురయ్యే సవాళ్లేంటి? ఎవరా నాయకుడు? కాంగ్రెస్‌లో ఎర్ర శేఖర్ కొత్త ప్రయాణం ఎలా ఉంటుంది? బీజేపీకి పాలమూరు జిల్లాలో గట్టి షాకే తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారాయన. గతంలో సుదీర్ఘకాలం టీడీపీలో కొనసాగిన […]
ఈ ఉద్యోగ నోటిఫికేషన్ లు నీటి మీద రాతలే… అందుకే నిరుద్యోగ యువత ఆత్మహత్య యత్నాలు చేసు కుంటున్నారు అని అన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు Nvss ప్రభాకర్. సీఎం చెప్పిన అధికారులు ఉద్యోగ ఖాళీలు ఇవ్వక పోవడం సీఎం అసమర్థతే కారణం… ఇది నిరుద్యోగులను వంచించడమే అని తెలిపారు. గో హత్య యథేచ్ఛగా రాష్ట్రంలో సాగుతోంది.. ప్రభుత్వం పైపై చర్యలు మాత్రమే తీసుకుంటుంది. నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరుస్తోంది. అసదుద్దీన్ ఒవైసీ డీజీపీకి లేఖ రాసాడు… […]