విజయవాడ రాజ్ భవన్ లో కరోనా థర్డ్ వేవ్ నివారణ పై అవగాహన -స్వచ్ఛంధ సంస్ధల పాత్ర అంశంపై శుక్రవారం వెబినార్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ… కరోనా మూడో తరంగ నివారణలో రాష్ట్రం దిక్సూచీ కావాలి అన్నారు. కరోనా మూడవ తరంగం రాకుండా నిరోధించడంలో ఆంధ్రప్రదేశ్ ఇతరులకు దిక్సూచిగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. కరోనా తొలి, మలి విడతలలో పలు స్వచ్ఛంధ సంస్ధలు అద్భుతంగా […]
ఆయనో సీనియర్ ఎమ్మెల్యే. టీడీపీ నుంచి గెలిచి అధికారపార్టీ పంచన చేరారు. నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం తహతహలాడుతున్నారు. మొదట్లో అంతా బాగానే ఉన్నట్టు కనిపించినా ఇప్పుడు అసమ్మతి ఆరునొక్క రాగం అందుకుందట. దీంతో అంతర్యుద్ధంలో చిక్కుకున్న ఎమ్మెల్యే ఎలా బయటపడతారోననే చర్చ మొదలైంది. వాసుపల్లి పార్టీ మారినా వైసీపీలో పెద్దగా మార్పు లేదట! వాసుపల్లి గణేష్ కుమార్. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు. టీడీపీ పవర్‌లో ఉన్నప్పుడు వైసీపీపై […]
ఏ పదవులు చేజారి పరువు పోగొట్టుకున్నారో.. ఇప్పుడు అవే పదవులను పట్టేసి పట్టు నిలుపుకొన్నారట ఆ ఎమ్మెల్యే. హైకమాండ్ కూడా ఎందుకొచ్చిన గొడవ అనుకుందో లేక ఎమ్మెల్యేకే ప్రయారిటీ ఇవ్వాలనుకుందో.. మొదట్లో జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా చేసింది. ఆలస్యంగానైనా పైచెయ్యి సాధించానని చెప్పుకొంటూ సదరు ఎమ్మెల్యే, ఆయన వర్గం జబ్బలు చరుచుకుంటోందట. గెలిచిన కొత్తలో సఖ్యతగా ఉండేవారు! పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి జిల్లాలోనే అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గం. 2 లక్షల 50 వేల […]
భారత మాజీ కెప్టెన్ ధోనికి ట్విట్టర్ షాకిచింది.. ధోని వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా నుంచి అధికారిక బ్లూ కలర్ వెరిఫైడ్ బ్యూడ్జ్‌ను తొలగించింది సోషల్ మీడియా దిగ్గజం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేశ వ్యాప్తంగా ధోనికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక ట్విట్టర్ లో ధోనిని దాదాపు 82 లక్షల మంది ఫాలో అవుతుండగా.. కెప్టెన్ కూల్ 33 మందిని ఫాలో అవుతున్నారు.. అయితే, ట్విట్టర్ ఈ నిర్ణయం […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 81,505 శాంపిల్స్ పరీక్షించగా… 2,209 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 22 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో 1,896 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19,78,350కు.. రికవరీ కేసులు 19,44,267కు పెరిగాయి.. ఇక, కరోనాబారినపడి ఇప్పటి వరకు మృతిచెందినవారి […]
కొత్త విద్యా విధానాన్ని ఏపీ కెబినెట్ ఆమోదించింది అని మంత్రి పేర్ని నాని తెలిపారు. కొత్త విద్యా విధానం వల్ల స్కూళ్ల మూసివేత ఉండదు.. ఏ ఉపాధ్యాయుడి ఉద్యోగం తీసే ప్రసక్తే ఉండదు. పీపీ-1, పీపీ-2 మొదలుకుని హైస్కూల్ ప్లస్ వరకు పాఠాశాలలు ఉంటాయి. హైస్కూల్ ప్లస్ కేటగిరిలో మూడో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యా బోధన ఉంటుంది. విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలను కెబినెట్లో తీసుకున్నాం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు […]
పప్పు చెప్పిన మాటలకు ఏం స్పందిస్తాం… ఎవరి పాదం మంచిదో రాష్ట్రంలో అందరికీ తెలుసు అని ఏపీ ఇరిగేషన్ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. తాజాగా ఎన్టీవీతో మాట్లాడిన ఆయన… జగన్ పాదం వల్ల రాష్ట్రంలో డ్యాములు, రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. అన్నమయ్య గేటు ఎత్తుకుని పోయిన విషయం ట్వీట్ చేసిన వ్యక్తి కి తెలియదా… చంద్రబాబు పాదం పడగానే గోదావరి లో 35 మంది చనిపోయారు. పులిచింతల గేటు కొట్టుకుపోవటం వల్ల నష్టం ఏమీ లేదు. […]
కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనతో విశాఖ ఎయిర్ పోర్ట్ దగ్గర హై అలెర్ట్ కొనదగుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకారణకు వ్యతిరేకంగా ఆర్ధిక మంత్రికి వినతులు సమర్పించాలని జెఏసీ నిర్ణయం తీసుకుంది. వందల సంఖ్యలో ఎయిర్ పోర్ట్ దగ్గరకు కార్మికులు వస్తారని ముందస్తు సమాచారం రావడంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. ఇక అక్కడికి వచ్చిన స్టీల్ ప్లాంట్ కార్మికులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ముందస్తు అనుమతి లేకపోవడంతో ఎయిర్ పోర్ట్ ఎంట్రన్స్ దగ్గరే అడ్డగిస్తున్నారు. విశాఖ […]
రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ను పేరు మార్చి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గా నామకరణం చేయడం దారుణం అని అన్నారు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి. ఇది బీజేపీ, మోడీ పాలకుల సంకుచిత బుద్ధికి నిదర్శనం అని తెలిపారు. యువకులను అన్ని రంగాలలో ప్రోత్సహించి దేశంలో క్రీడా అభివృద్ధి కి ఎంతో కృషి చేసిన స్వర్గీయ భారత రత్న రాజీవ్ గాంధీ పేరును ఖేల్ రత్నగా ఉండడం సముచితం. కాబట్టి ఇలాంటి […]