హరీష్ రావ్ హుజూరాబాద్ లో అడ్డా పెట్టి అబద్దాల కారు కూతలు కూస్తున్నారు అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. డ్రామా కంపెనీ లాగా మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టి యాక్షన్ చేస్తున్నాడు. ప్రతి మాటలో వ్యంగ్యం, అబద్దం, ఇతరుల ఆత్మ గౌరవాన్ని కించపరిచే పద్దతి ఆపకపోతే నీ చరిత్ర ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది హరీష్ నీకు సవాలు చేస్తున్న.. అభివృద్ది జరగలేదు.. డబుల్ బెడ్ రూమ్ కట్టలేదు అని తెలిపారు. కుంకుమ భరిణలు పంపించి […]
పేరుకు అభివృద్ధి అని చెబుతున్నా.. అధికారపార్టీని ఇరుకున పెట్టేలా వైరిపక్షాలు అడుగులు వేస్తున్నాయా? భద్రాచలంలో.. ఆ ఐదు గ్రామాల అంశాన్ని మళ్లీ రోడ్డెక్కించడం వెనక వ్యూహం అదేనా? ఢిల్లీ స్థాయిలో కదలిక తేవాల్సిన చోట.. లోకల్ పాలిటిక్స్ వేడి పుట్టిస్తాయా? ఇంతకీ ఆ ఐదు గ్రామాల రగడేంటి? ఐదు గ్రామాల విలీనంపై ఇరుకున పెట్టే రాజకీయాలు! భద్రాచలానికి ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలు పిచ్చుకలపాడు, పురుషోత్తమ పట్నం, ఎటపాక, గుండాల, కన్నాయిగూడెంలను తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్ […]
యుద్ధం గెలవాలంటే.. నడిపించే నాయకుడు ఉండాలి.. దూసుకొస్తున్న బుల్లెట్లకు ఎదురెళ్లేంత సాహసం ఉండాలి.. వెన్ను చూపని వీరులను ఎన్నుకోవాలి.. శత్రువు ఎక్కువగా ఉన్నా సరే స్ఫూర్తిని పంచే నాయకుడు అయ్యిండాలి.. ‘బాహుబలి’ సినిమాలో కాలకేయులు లక్షల మంది ఉన్నా వేలమంది బాహుబలి సైన్యం ఎలా గెలిచింది? వారిలో స్ఫూర్తిని నింపి బాహుబలి ‘కాలకేయుడి’ని చంపేశాడు. కానీ అప్ఘనిస్తాన్ లో మాత్రం దీనికి రివర్స్ అయ్యింది. పోరాటం చేయాల్సిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కాడి వదిలేసి వేరే దేశం […]
రేవంత్ రెడ్డి పీసీసీ, బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కావడానికి కారణం సీఎం కేసీఆర్ మాత్రమే. గులాబీ జెండా పుణ్యమే మీకు అధ్యక్ష పదవులు వచ్చాయని మంత్రి హరీష్ రావు అన్నారు. కాబట్టి మీరు చేయాల్సింది పాదయాత్రలు కాదు… పెంచిన గ్యాస్ , డీజిల్ ధరల పై ఢిల్లీ యాత్రలు చేయాలి. టీఆర్ఎస్ పార్టీ జల దృశ్యంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ దాకా పోయింది. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అభివృధి లో ఇతర రాష్ట్రాలకు […]
తెలంగాణ మున్నూరు కాపు సంఘం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్రకు సంపూర్ణ మద్దతు తెలిపింది. సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుక్క వేణుగోపాల్ ఆధ్వర్యంలో సంజయ్ ను కలిశారు మున్నూరుకాపు నేతలు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… రాష్ట్ర మున్నూరు కాపు సంఘం బీజేపీ యాత్రకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉంది. టీఆర్ఎస్ దుర్మార్గ పాలన పోవాలని రాష్ట్రంలోని అన్ని కుల సంఘాల నాయకులు కుల సంఘాల ప్రజలు రాజకీయాలకతీతంగా […]
తెలంగాణ వేదికగా హుజూరాబాద్ రాజకీయం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఉప ఎన్నికకు కారణమైన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. బీజేపీ అభ్యర్థిగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. పోటీగా.. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్.. పోటాపోటీ వాడీవేడీ ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో.. కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేక మల్లగుల్లాలు పడుతోంది. కొన్నాళ్లపాటు కొండా సురేఖ పేరు బలంగానే వినిపించింది. కానీ.. ఆమె సుముఖంగా ఉన్నారా లేదా.. అన్నది కూడా సరైన స్పష్టత రాకుండా […]
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ… ప్రపంచ చరిత్రలో మానవత్వం ఉండే నాయకుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకరు అని తెలిపారు. చరిత్ర పుటల్లో స్వర్ణక్షరాలతో రాయదగిన వ్యక్తి వైఎస్సార్. సమాజం మీద ప్రేమను చాటడమే కాకుండా కేవలం 5 ఏళ్ళల్లో ప్రజల జీవితాల్లో ఎంత ముద్ర వేయవచ్చో నిరూపించిన వ్యక్తి అని తెలిపారు. ఆయన నాటిన మొక్కే ఇవాళ జగన్ మహా వృక్షం అయి మన ముందు ఉన్నారు. తండ్రికి తగిన తనయుడు. […]
కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాయని అంటుంటారు. ఆయన వేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలు గమనిస్తే అది నిజమే అని ఎవరైనా అంగీకరిస్తారు. తాజాగా.. ఢిల్లీలో తెలంగాణ భవన్ కు శంకుస్థాపన చేస్తున్న కేసీఆర్ తీరు.. సైతం ఈ చర్చలో ముందుకు వస్తోంది. ఇదంతా.. భవిష్యత్ రాజకీయాలకు పునాదిగా భావించవచ్చా.. అన్న ప్రశ్నలు సైతం ఉదయిస్తున్నాయి. ఇందుకు రకరకాల కారణాలను రాజకీయ విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి రోజు రోజుకూ బలం పెరుగుతున్నాకొద్దీ.. […]
వాళ్లిద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టారు.. కానీ రాజకీయం ఆ అన్నాచెల్లెలును వేరుచేసింది. చెరో రాష్ట్రంలో చెరో దిక్కుగా విడిపోయారు. చెల్లెలి కోరిక అన్నకు నచ్చలేదు. కానీ రాజకీయ వారసత్వాన్ని చెల్లి కొనసాగించాలనుకుంది.. బంధం దూరమైనా ఆ తండ్రి చూపిన దారి మాత్రం వారిద్దరిని కలిపింది.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నాడు ఆయన బిడ్డలు వైఎస్ జగన్, షర్మిల కలిసిపోవడం వైఎస్ అభిమానులకు కన్నుల పండువగా మారింది ఈ పరిణామం కంటే ముందు చాలా విషయమే […]
వైఎస్సార్ వర్ధంతి సభలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు ఎంపీ విజయసాయిరెడ్డి. జీవీఎంసీ మేయర్, కార్పొరేటర్ల కు కర్తవ్య బోధ చేసారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు… ఇక నుంచి అందరూ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. అవినీతి రహిత పాలన, సమర్ధ నాయకత్వం ప్రజలు కోరుకుంటున్నారు. పదవుల విషయంలో అందరికి అవకాశాలు కల్పిస్తాం. ఇక్కడ కొన్ని ఆరోపణలు నా దృష్టికి వచ్చాయి. భూములు, పంచాయతీలు చేస్తున్నానని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. నాకు డబ్బు మీద ఆసక్తి లేదు. […]