రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు స్కూల్ బస్సులపై రవాణా శాఖ దాడులు కొనసాగుతున్నాయి. కరోనా కారణంగా ఏడాదిన్నర తర్వాత విద్య సంస్థలు తెరుచుకున్న విషయం తెలిసిందే. ఆ కారణంగా విద్యార్ధులను తరలించే బస్సుల పై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. నార్సింగీ, కొండాపూర్, చేవెళ్ళతో పాటు శంషాబాద్ లో తనిఖీలు నిర్వహిస్తుంది అధికారుల బృందం. అయితే నిన్న 12 బస్సులను సీజ్ చేసిన అధికారులు నేడు నిబంధనలు పాటించని మరో స్కూల్ 15 బస్సులను […]
హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టు విచారణ జరిపింది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం నిషేధించాలన్న న్యాయవాది వేణుమాధవ్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. నిమజ్జనం సందర్భంగా ఆంక్షలు, నియంత్రణ చర్యలు సూచించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం, గణేష్ ఉత్సవ సమితి, పిటిషనర్ నివేదికలు సమర్పించాలి. కొవిడ్ పరిస్థితులు, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి అని తెలిపింది. ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తూనే.. ప్రస్తుత పరిస్తితులు కూడా చూడాలి. ఎక్కడికక్కడ స్థానికంగానే నిమజ్జనం చేస్తే బాగుంటుందన్న హైకోర్టు… సామూహిక నిమజ్జనంతో […]
బండి సంజయ్ మతాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ పాదయాత్ర లో బిజెపి సీఎంలు ఏం చేస్తున్నారో చెప్పాలి. సంజయ్ యాత్రలో ప్రజలు ఎక్కడా లేరు… బీజేపీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారు అని తెలిపారు. ఇక 111 జీవో వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది… అది రాష్ట్రంకు సంబంధించిన విషయం కాదు. జితేందర్ రెడ్డితో పాటు మరికొంత మంది బీజేపీ నేతలకు 111 జీవో పరిధిలో […]
చినికి చినికి గాలివానగా మారడం అంటే ఏంటో నరసరావుపేట గొడవను చూస్తే తెలుస్తుంది. మున్సిపల్ కమిషనర్ తీరుకు ఓ వర్గం యుద్ధం ప్రకటించింది. సమస్యను ఎలా కొలిక్కి తేవాలో ఎమ్మెల్యేకు పాలుపోవడం లేదు. వివాదం ఎక్కడ రాజకీయంగా తనకు ప్రతికూలంగా మారుతుందోనని ఆందోళన చెందుతున్నారట. ముస్లిం మహిళా వాలంటీర్‌పై కమిషనర్ ఆగ్రహం! గుంటూరు జిల్లా నరసరావుపేట. పల్నాడుకు ముఖద్వారమైన ఈ ప్రాంతంలో మాటంటే పడేరకం కాదు ఇక్కడి ప్రజలు. అలాంటిది ఒక ముస్లిం మహిళా వాలంటీర్‌పై మున్సిపల్ […]
కేఆర్ఎంబీ అధికారులపై తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ లేఖలు రాసి అధికారులను వేదిస్తోంది అని అన్నారు. కల్వకుర్తి లాంటి ప్రాజెక్టులు 1980లో శంకుస్థాపన చేశారు. అలాంటి ప్రాజెక్టు అనధికార ప్రాజెక్టు ఎలా అవుతుంది. ఏపీ రాసిన ప్రతీ లేఖ పై కేఆర్ఎంబీ-జీఆర్ఎంబీ తెలంగాణ వివరణ కోరడం ఏంటీ అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పూర్వపరాలు తెలుసుకోకుండా బోర్డులు తెలంగాణకు సమాధానాలు ఇవ్వాలని […]
ప్రస్తుతం టాలివుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనుమానం ఉన్న సినీ తారలకు ఈడీ సమన్లు పంపింది. నిన్న దర్శకుడు పూరి జగన్నాథ్ ఈడీ ముందు విచారణకు కూడా హాజరయ్యారు. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న కెల్విన్ ఈడీ ముందు అప్రూవర్గా మారినట్లు తెలుస్తుంది. 6 నెలల క్రితం కెల్విన్ పై కేసు నమోదు చేసింది ఈడీ. ఎక్సైజ్ కేసు ఆధారంగా కెల్విన్ పై ఈ కేసు నమోదు చేసింది. […]
మెదక్ కొల్చారంలో ఐఎంఎల్ ( మద్యం స్టోరేజ్ సెంటర్) కి బీరు బాటిల్స్ తీసుకొస్తున్న లారీని దొంగలించారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ లో బీర్ ఫ్యాక్టరీ లో కార్టన్లను లారీ లో లోడ్ చేసారు. అక్కడి నుండి కొల్చారం మండలం చిన్న ఘనపూర్ డిపోలో లోడ్ ను దింపేందుకు లారీ వచ్చింది. కానీ అక్కడ వరుసగా లారీల క్యూ ఉండడంతో డ్రైవర్ ఇంటికి వెళ్ళాడు. సమయం చూసుకొని లారీతో సహా బీర్లను తీసుకుని వెళ్లి పోయారు దొంగలు. […]
తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం కొలిక్కి వస్తుందా? ఇగోలను పక్కనపెట్టి క్షేత్రస్థాయి అంశాలపై చర్చిస్తారా? తెలంగాణ ప్రస్తావించే అంశాలేంటి? ఏపీ వాదనలేంటి? ఇన్నాళ్లూ సమావేశాలకు దూరంగా ఉన్న తెలంగాణ.. KRMB, GRMB భేటీలకు హాజరు కావడం వెనక ఆంతర్యం ఏంటి? కేఆర్‌ఎంబీ భేటీపై ఉత్కంఠ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య జల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. నీటి పంచాయితీలు తెగడం లేదు. ఇటీవల కృష్ణా నది యాజమాన్య బోర్డుకు, గోదావరి నది యాజమాన్య బోర్డుకు […]
భారత్‌లో మరోసారి పెరిగాయి కరోనా పాజిటివ్ రోజువారి కేసులు. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 41,965 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 460 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 33,964 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,28,10,845కు పెరగగా.. రికవరీ కేసులు 3,19,93,644కు పెరిగాయి. […]