మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా రూ. 44,200 కి చేరింది. కానీ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. […]
నేడు ఏపీలో ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్ కు పిలుపునిచ్చాయి. అయితే కరోనా వైరస్ కారణంగా గత ఏడాదిన్నరగా మూసిఉన్న విద్యాసంస్థలు ఏపీలో గత నెల 16 నుండి ప్రారంభమయ్యాయి. అయితే ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై జీవో 53 విడుదల చేసింది. గ్రామ, మున్సిపాల్టీ, కార్పోరేషన్ వారీగా ఫీజులను నిర్ధారించింది ప్రభుత్వం. అయితే ఆ జీవో పై నిరసనలకు పిలుపునిచ్చారు ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు. ఇక ఈ కరోనా సమయంలో విద్యాసంస్థలు తెరుచుకోవడంతో కొన్ని […]
మేషం : స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వల్ల ఆందోళనలకు గురవుతారు. బంధు మిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆలయ సందర్శనాలలో స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికం. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెద్ద మొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమంకాదని గమనించండి. వృషభం : ఉద్యోగస్తుల తొందరపాటుతనానికి అధికారులతో మాటపడక తప్పదు. చిన్నతరహా పరిశ్రమలలో వారికి పురోభివృద్ధి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు […]
వెలిగొండ ప్రాజెక్టును కేంద్ర గెజిట్‌లో చేర్చాలన్నది ప్రకాశం టీడీపీ నేతల డిమాండ్. ఇదే అంశంపై రెండు రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. అక్కడితో ఆగితే బాగోదని అనుకున్నారో ఏమో సడెన్‌గా ఢిల్లీ వెళ్లారు. కాకపోతే హస్తిన పర్యటనను రహస్యంగా ఉంచడమే చర్చగా మారింది. ఎందుకు గోప్యత పాటించారు? ప్రకాశం టీడీపీ నేతలకు వచ్చిన ఇబ్బందేంటి? ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి షెకావత్‌ను కలిసిన ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు! ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టుపై ఆ జిల్లా టీడీపీ […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 59,566 సాంపిల్స్ పరీక్షించగా.. 1,378 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 10 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 1,139 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,16,680కు పెరగగా… రికవరీ కేసులు 19,88,101కు చేరాయి.. ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 13,877 […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు గతంలోనూ ఎన్నడూ లేనివిధంగా సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించబోతున్నాయి. కేవలం రెండేళ్లపాటు ఉండే మా అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు నటీనటులు తీవ్రంగా పోటీపడుతున్నారు. కేవలం 900మంది సభ్యులు ఉండే మా అసోసియేషన్ కు నిర్వహించడం ఈసారి కత్తిమీద సాములా మారింది. నటీనటుల మధ్య నెలకొన్న ఈగోల వల్ల ఈసారి ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపింపజేస్తున్నాయి. ఒకరిని మించి మరొకరు విమర్శలు చేసుకుంటుండటంతో మా పెద్దలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం […]
కాంగ్రెస్ రాజకీయమే అంత. ముఖ్యంగా హైకమాండ్ పాలిటిక్స్. దేన్నీ అంత తొందరగా తేల్చదు. అంతా నీదే అంటుంది..కానీ ఆ మాట నేతలందరితో అంటుంది. అదే కాంగ్రెస్ స్పెషాలిటీ. ఎవరి మాట తీసేయదు..అలాగే ఎవరికీ పెద్ద పీఠ వేసి కూర్చోపెట్టదు. కాంగ్రెస్ మార్క్ రాజకీయం అంటేనే అది. ఇప్పుడు హుజూరాబాద్‌లోనూ అదే జరుగుతోంది. ఈ నెలలోనే ఉప ఎన్నికలు తప్పేలా లేవు. టీఆర్‌ఎస్ తన అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీకి ఈటల రాజేందర్ ఉండనే ఉన్నారు. ఇక మిగిలింది కాంగ్రెస్. […]
ఎన్నికలంటేనే బోల్డంత ఖర్చు. పోలింగ్ తేదీ ఖరారైతే ఖర్చుకు ఒక లెక్క తెలుస్తుంది. హుజురాబాద్‌లో మాత్రం అంతా రివర్స్. ఉపఎన్నిక ఎప్పుడో తెలియదు. 2 నెలలుగా ప్రధాన పార్టీలు డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నాయి. జేబులు ఖాళీ అవుతున్నాయి తప్ప ఎలక్షన్ ఎప్పుడో.. ఏంటో.. క్లారిటీ లేదు? ఇంకా ఎన్ని రోజులు.. ఎంత ఖర్చు పెట్టాలో తెలియక ఆందోళన చెందుతున్నారట నేతలు. వందల మందితో కలిసి ఎన్నికల ప్రచారం! హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. […]
రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు. ఆ ఐదుగురు ఐఏఎస్ లకు జైలు శిక్షతో పాటుగా జరిమానా విధించింది. ఓ మహిళా భూమి తీసుకొని నష్ట పరిహారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నెల్లూరు జిల్లా తాళ్లపాక సాయి బ్రహ్మ భూ వ్యవహారంలో తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశించిన తర్వాత కూడా చెల్లింపుల జాప్యం పై సీరియస్ అయ్యింది న్యాయ స్థానం. ఆ ఐఏఎస్ అధికారుల జీతాల నుంచి కట్ చేసి […]