Deputy CM Pawan Kalyan: పిఠాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద నిన్న సాయంత్రం అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆ సమయంలో అప్రమత్తమైన స్థానికులు నిందితుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చిందని పవన్ తెలిపారు. లేనిపక్షంలో నిందితుడు తప్పించుకోడానికి ఆస్కారం కలిగేదన్నారు. ఈ అమానుష చర్యను సభ్యసమాజంలోని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ దుస్సంఘటన గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా బాధితురాలిని, వారి కుటుంబ సభ్యులకు సహాయసహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ముద్దాయికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. స్థానిక జనసేన నాయకులను కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి, సహాయం అందించాలని స్పష్టం చేశామని పవన్ కల్యాణ్ తెలిపారు.
అసలేం జరిగిందంటే.. Pithapuram Crime: పిఠాపురంలో దారుణం.. మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారం.. ఆపై..!