CM Chandrababu: రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో సమావేశమవుతూ బిజీబిజీగా ఉన్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పోలవరం మెుదటి విడత నిధులు, రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు ద్వారా అందించే రూ.15 వేల కోట్లపైనా ఇరువురు చర్చించారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన అంశాలనూ ప్రధాని దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్. ఢిల్లీ టెన్ జన్‌పథ్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. విశాఖ రైల్వే జోన్ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఉదయం కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రహదారుల అంశంపై గంటన్నర పాటు సమావేశమయ్యారు. తాజాగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో భేటీ అయ్యారు. ఢిల్లీలోని చంద్రబాబు అధికారిక నివాసానికి కేంద్ర మంత్రి సాదరంగా ఆహ్వానించారు. విశాఖ ఉక్కు సెయిల్‌లో విలీనంపై కీలక చర్చ జరుగుతోంది.
Read Also: Minister Nadendla Manohar: సమాజం కోసం, దేశం కోసం.. పవన్ కల్యాణ్ నిర్ణయాలు