తెలంగాణలో రైతుల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. రుణమాఫీ చెల్లింపులకు రూ.167.59 కోట్లు ఆర్థికశాఖ నుండి విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాట ప్రకారం నేడు రూ.37 వేల నుండి రూ.41 వేల మధ్యన ఉన్న రుణాలు మాఫీ అయ్యాయి.
మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ధైర్యం ఉంటే 20 రోజులు సభ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో అతి తక్కువ పని దినాలు జరిగేది తెలంగాణలోనే అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం వద్ద ఉద్రిక్తతత నెలకొంది. వరద బాధితులకు తక్షణ ఆర్థిక సహాయంగా లక్ష రూపాయలు అందజేయాలని డిమాండ్ చేస్తూ ధర్మ సమాధి పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
మెదక్ జిల్లాలో జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. కట్టుకున్న భర్తను, తన చెల్లి హత్య చేసేందుకు అక్క సుపారీ ఇచ్చి హత్య చేయించిన దారుణ ఘటన మెదక్ జిల్లాలోని హత్నూర మండలం షేర్‌ఖాన్‌పల్లిలో చోటుచేసుకుంది.
కోకాపేటలోని నియో పోలిస్ ఫేజ్-2లో భూములు రికార్డు స్థాయిలో ధర పలికాయి. నియో పోలస్‌లో హెచ్‌ఎండీఏ ఎకరం భూమికి రూ.35 కోట్లుగా ధరను నిర్ణయించగా.. ఈ భూముల వేలంలో దిగ్గజ స్థిరాస్తి సంస్థలు పోటీపడ్డాయి.
ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై గురువారం లోక్‌సభలో చర్చిస్తున్న సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఢిల్లీ కోసం చట్టాలు చేయడానికి కేంద్రాన్ని అనుమతించే నిబంధనలు రాజ్యాంగంలో ఉన్నాయని ఆయన అన్నారు.
దేశంలో నానాటికీ మగాళ్లు.. మృగాళ్ల రూపంలో మారిపోతూ స్త్రీ లకు రక్షణ లేకుండా చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో.. రాను రాను సమాజం ఇలా తయారు అవుతుంది ఏంటి.. మనుషులు మరీ ఇంతలా దిగజారిపోతున్నారా అని అనుకున్న ప్రతిసారీ అంతకు మించి ఛీ అనుకునే సంఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి.
సీఎం విశాఖకు రాకపై మంత్రి అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దసరా పండగ రోజున విశాఖ ప్రజలకు బ్రహ్మాండమైన కానుక ఉంటుందని ఆయన తెలిపారు. విశాఖ ప్రజలు ఎదురు చూస్తున్న కల దసరాతో తీరుతుందని పేర్కొన్నారు.