గాజాలో జరిగిన యుద్ధం సోమవారం పులిట్జర్ ప్రైజ్‌లలో ప్రముఖంగా ప్రదర్శించబడింది. ఇజ్రాయెల్-హమాస్ సంఘర్షణను కవర్ చేస్తున్న పాత్రికేయులు ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు.
యూపీలో గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ క్యాంపస్‌లోని స్టాఫ్ క్వార్టర్స్ భవనంలోని వాటర్ ట్యాంక్ నుంచి ఒక మహిళ మృతదేహాన్ని సోమవారం వెలికితీయడంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఆ మహిళ తన భర్త, అత్తతో కలిసి అక్కడే నివసించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్ర ప్రస్తుతానికి వాయిదా పడింది. అయితే, కొత్త లాంచ్ తేదీ ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియలేదు. సాంకేతిక లోపం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
జార్ఖండ్‌లో భారీ మొత్తంలో నగదు రికవరీ కేసులో కీలక చర్యలు తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంత్రి అలంగీర్ ఆలం వ్యక్తిగత సహాయకుడు సంజీవ్ లాల్, అతని సేవకుడు జహంగీర్ ఆలంలను అరెస్ట్ చేసింది.
లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో రికార్డు స్థాయిలో ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రజలను కోరారు. "నేటి దశలో ఓటు వేసే వారందరినీ రికార్డు సంఖ్యలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వారి చురుకైన భాగస్వామ్యం ఖచ్చితంగా ఎన్నికలను మరింత చైతన్యవంతం చేస్తుంది" అని ప్రధాని మోడీ ఎక్స్(గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఉదయం అహ్మదాబాద్‌లోని ఓ పాఠశాలలో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి కంగనాను బీజేపీ పోటీకి దింపింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కంగనా రనౌత్ సినీ పరిశ్రమను విడిచిపెట్టేది లేదని చెప్పారు.
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు వ్యోమగాములు బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌షిప్‌లో నేడు స్పేస్‌లోకి దూసుకెళ్లనున్నారు.
లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ నేడు జరగనుంది. ఈ దశలో, 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రజలు నమోదు చేయనున్నారు. ఈ దశలో 1351 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా.. వారిలో 120 మంది మహిళలు ఉన్నారు.