యునిసెఫ్ ( యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్-UNICEF ) ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి కరీనా కపూర్‌ను నియమించారు. ఈ విషయాన్ని యునిసెఫ్ శనివారం ప్రకటించింది. 2014 నుంచి ఆమె యునెసెఫ్ సెలబ్రిటీ అడ్వకేట్‌గా కొనసాగుతున్నారు. మే 4న (శనివారం) ఆమె నియామకం ఖరారైంది.
భారతదేశంలో అత్యంత సీనియర్ ఆఫ్ఘన్ దౌత్యవేత్త జకియా వార్దక్ తన పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి ఆమె దుబాయ్ నుండి సుమారు రూ. 19 కోట్ల విలువైన 25 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించిన ఆరోపణలపై గత వారం ముంబై విమానాశ్రయంలో పట్టుబడ్డారు.
లోక్‌సభ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. రాజకీయ పార్టీలు పూర్తి సన్నద్ధతతో ఓటర్లను తమవైపు తిప్పుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రామనగరికి రానున్నారు.
మొబైల్ ఫోన్ వాడనివ్వట్లేదని తన అన్నను ఓ బాలిక హత్య చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాఘర్-చుయిఖదాన్-గండాయ్ (కేసీజీ) జిల్లాలో 14 ఏళ్ల బాలిక మొబైల్ ఫోన్‌లో అబ్బాయిలతో మాట్లాడినందుకు తనను మందలించాడని తన అన్నయ్యను నరికి చంపినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
ఏపీలోని ఆ అసెంబ్లీ నియోజకవర్గం మీద అమిత్ షా నుంచి గల్లీ లీడర్ దాకా బీజేపీ నేతలంతా ఫోకస్ పెట్టారు. ఫ్యాన్ మీద పైచేయి కోసం బీజేపీ బెటాలియన్ మొత్తం దిగిపోతోంది. కానీ.... అదే పార్టీకి చెందిన ఒక్క ముఖ్య నేత మాత్రం ఆ వైపే చూడ్డం లేదట. పైగా సెగ్మెంట్‌లో గట్టి పట్టున్న నాయకుడు ఆయన. జాతీయ నేతలు వస్తున్నా పట్టించుకోని ఆ నియోజకవర్గ నేత ఎవరు? ఎందుకలా చేస్తున్నారు?
కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తుని వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ప్రచారంలో వేగాన్ని పెంచారు. మరో వైపు తల్లి గెలుపును కాంక్షిస్తూ ఆమె కూతురు మనీషా రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు.