ఏపీలో భారత్ నెట్ ప్రాజెక్టును విస్తృతపరిచేందుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. భారత్ నెట్ సమర్థ వినియోగం కోసం రాష్ట్రానికి 35 లక్షల సీపీఈ బాక్సులు సరఫరా చేయాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో శ్యామలారావు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.అక్టోబర్ 4 నుంచి 12 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలో సాగర్ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారిలో పోతిరెడ్డి లోకేష్(19) విద్యార్థి మృతదేహం లభ్యం కాగా.. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని ఏడీసీ నర్సరీలను మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రూ. 41వేల కోట్లతో అమరావతికి గతంలో టెండర్లు ఇచ్చామని.. గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి అమరావతిని నిర్వీర్యం చేసిందని ఆయన మండిపడ్డారు.
ప్రియుడు మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. తిరుపతి జిల్లా విజయపురం మండలానికి చెందిన దిల్షాద్ అనే మహిళకు తమిళనాడుకు చెందిన హుస్సేన్‌తో వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు.
రాష్ట్రంలో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగర వనాలు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఆమోదం తెలియజేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. 11 మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో నూతనంగా నగర వనాలు అభివృద్ధి నిమిత్తం తొలి విడతగా రూ.15.4 కోట్లను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నిధులను మంజూరు చేసిందని తెలిపారు.
సైబర్ క్రైమ్ పోలీసులు ఏడు బృందాలుగా గుజరాత్‌లో పది రోజులపాటు ఓ ఆపరేషన్ నిర్వహించారని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆపరేషన్‌లో భాగంగా వివిధ సైబర్ క్రైమ్‌లకు పాల్పడిన 36 మందిని అరెస్ట్ చేశారని.. ఆ నిందితులు దేశవ్యాప్తంగా సుమారు వెయ్యి కేసుల్లో నిందితులుగా ఉన్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ శాఖలు ఉద్యోగుల బదిలీలకు గైడ్‌లైన్స్ జారీ చేస్తు్న్నాయి. రవాణ శాఖలో రెండేళ్లకే స్థాన చలనం ఉండేలా గైడ్ లైన్స్ జారీ అయ్యాయి. రవాణా శాఖలోని ఉద్యోగ సంఘాలు ఏవీ కోరకుండానే బదిలీల్లో గైడ్ లైన్స్ జారీ అయినట్లు తెలిసింది.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఎసెన్షియా ప్రమాదంలో మృతుల కుటుంబాలకు వైసీపీ పార్టీ తరపున 5లక్షలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రకటించారు. గాయపడ్డ వారికి లక్ష రూపాయలు ప్రకటించినట్లు వైసీపీ తరఫున ఆయన పేర్కొన్నారు.