ఎంఎంఆర్ ఆర్ట్ క్రియేషన్స్ ప్రొడక్షన్ పతాకంపై కిరణ్ దర్శకత్వంలో నిర్మాత మంద మల్లికార్జున రెడ్డి నిర్మిస్తున్న చిత్రం '"ఈమె సుబ్బమ్మ ఇదియే ఈమె కథ". ఈ సినిమా నేడు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది .
హైదరాబాద్ NMDC మారథాన్‌లో ఈశా బ్రహ్మచారులు, ఇంకా వాలంటీర్లు ఈశా విద్యకు మద్దతుగా పరిగెత్తారు ఈశా విద్య పై అవగాహన, ఇంకా నిధులను సేకరించే ప్రయత్నంలో, 31 మంది ఈశా బ్రహ్మచారులతో పాటు 170కి పైగా మద్దతుదారులు ఆగస్టు 25న హైదరాబాద్‌లో జరిగిన NMDC మారథాన్‌లో పాల్గొన్నారు. వారు 42 కిమీ పూర్తి మారథాన్, ఇంకా 21 కిమీ హాఫ్ మారథాన్‌లో, 10కే రన్‌లలో పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో గచ్చిబౌలిలో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున ఎక్స్ వేదికగా స్పందించారు. ఎన్-కన్వెన్షన్‌కు సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయని నాగార్జున పేర్కొన్నారు
ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం– సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ (20708/20707) ఎక్స్‌ప్రెస్ రైలుకు ఏలూరు స్టేషన్‌లో ఒక నిమిషం హాల్టింగ్ సదుపాయాన్ని రైల్వే అధికారులు కల్పించారు. ఏలూరులో నేడు తొలిసారిగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆగింది.
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల గురించి మాట్లాడినప్పుడల్లా ఎలాన్ మస్క్, జెఫ్ బోజెస్, ముఖేష్ అంబానీ తదితరుల పేర్లు తెరపైకి వస్తాయి. వారు ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు అనడంలో సందేహం లేదు. అయితే వీరంతా పురుషులే. ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ ఎవరో తెలుసా? ఈ మహిళ పేరు ఆలిస్ వాల్టన్. 74 ఏళ్ల ఆలిస్ వాల్టన్ ఒక పెద్ద అమెరికన్ వ్యాపార మహిళ. ఆమె వాల్‌మార్ట్ వ్యవస్థాపకుడు సామ్ వాల్టన్ కుమార్తె.
శ్రీకాకుళం జిల్లాలో పీఆర్‌టీయూ యూనియన్ భవనాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.
రిలయన్స్ జియో హెచ్చరికలు జారీ చేసింది. జియో తన పేరుతో జరుగుతున్న మోసానికి సంబంధించి ఈ వార్నింగ్ ఇచ్చింది. జియో పేరుతో ప్రజలను మోసాలకు గురిచేస్తున్నారని కంపెనీ పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో టెలికాం కంపెనీ జియో మొబైల్ వినియోగదారులకు వార్నింగ్ ఇచ్చింది.
తిరుపతిలో కొత్త బస్టాండ్ ఏర్పాటు కానుంది.. ఈ మేరకు బస్టాండ్‌లో పర్యటించింది ఎన్‌హెచ్‌ఎల్ ఎం కమిటీ. కమిటీ సీఈఓ ప్రకాష్ గౌర్, ప్రాజెక్టు డైరెక్టర్ పూజా మిశ్రా తో కలిసి ఎంపి గురుమూర్తి పర్యటించారు. బస్టాండ్ ఆవరణలో పర్యటించి పలు అంశాలను వివరించారు ఎంపీ గురుమూర్తి.
కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గిపోవడంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు తగ్గిపోతోంది. జూరాల, సుంకేసుల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో జలాశయం నిండుకుండను తలపిస్తోంది. శ్రీశైలం జలాశయానికి 45,855 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 37,882 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో ఓ రోగి విచక్షణారహితంగా ప్రవర్తించాడు. డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్ మీద దురుసుగా ప్రవర్తించాడు. ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో డాక్టర్లు ధర్నాకు దిగారు. అసలు వివరాల్లోకి వెళ్తే.. శనివారం ఉదయం తిరుమలలోని అశ్వినీ ఆస్పత్రి నుంచి స్పృహలో లేని ఓ పేషెంట్‌ను తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు.