Thangalan: విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'తంగలాన్' ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించింది. చియాన్ విక్రమ్ కెరీర్‌లో26 కోట్ల రూపాయల బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ అందుకుంది. కొత్త మూవీస్ రిలీజ్ అవుతున్నా 'తంగలాన్' సినిమా సెకండ్ వీక్‌లో తమిళనాడు, ఏపీ, తెలంగాణ అంతటా స్ట్రాంగ్ హోల్డ్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
శ్రీ సింహ, సత్య. నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన 'మత్తు వదలరా' చిత్రం డిసెంబర్ 25, 2019లో విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యింది. నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వం వహించిన క్రైమ్ కామెడీ 'మత్తు వదలరా' ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు, ఆ చిత్ర బృందం దాని అధికారిక సీక్వెల్‌తో మరోసారి ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధమవుతోంది.
నేచురల్ స్టార్ నాని నటించిన 'సరిపోదా శనివారం' మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. డైరెక్టర్ వివేక ఆత్రేయ తెరకెక్కించిన ఈ చిత్రంలో గ్యాంగ్‌లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది.
Trisha: నయనతార, కాజల్, సమంత, పూజా హెగ్డే, తమన్నా, శృతి హాసన్, ఇతరులతో సహా 2000, 2010 లలో దాదాపు అందరు సౌత్ హీరోయిన్లు ప్రత్యేక పాటలు చేసారు. అయితే, త్రిష ఇప్పటి వరకు అలాంటి ఆఫర్లను అంగీకరించలేదు. ఎట్టకేలకు ప్రత్యేకంగా ఎవరికో మినహాయింపు ఇచ్చేందుకు ఆమె అంగీకరించినట్లు కనిపిస్తోంది.
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో నటి నమితకు చేదు అనుభవం ఎదురైంది. కృష్ణాష్టమి సందర్భంగా గుడికి వెళ్లిన తనను అడ్డుకున్నారని నమిత వీడియోను రిలీజ్ చేశారు, నన్ను, నా కుటుంబ సభ్యులను హిందూ కుల ధ్రువీకరణ పత్రం అడిగారని సిబ్బంది దురుసుగా, అహంకారంగా మాట్లాడారని నమిత వీడియోలో తెలిపింది.
గత ప్రభుత్వంలో పాలనా మొత్తం అస్తవ్యస్తంగా సాగిందని మంత్రి నారాయణ తీవ్రంగా విమర్శించారు. 19 వందల కోట్ల పురపాలక శాఖ నిధులు ఇతర పనుల కోసం మళ్ళించారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ఒక్క తుడాలో మాత్రమే జీతాలకోసం 15కోట్లు ఖర్చు చేశారన్నారు.
విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి రెండు వరుస హిట్‌లను అందించిన తర్వాత, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తమ హ్యాట్రిక్ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోంది.