Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. డైరెక్టర్ వివేక ఆత్రేయ తెరకెక్కించిన ఈ చిత్రంలో గ్యాంగ్‌లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఆగస్టు 29న విడుదల కానుంది. ఇక ఈ చిత్రం ఇతర భాషల్లో Suryas Saturday టైటిల్‌తో విడుదలవుతోంది. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంతో పాటు సినిమాపై మంచి అంచనాలు పెరిగిపోయాయి. నేచురల్ స్టార్ నాని సినిమా అంటే కేవలం తెలుగునాట మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లోనూ క్రేజ్ ఉంటుంది.
Read Also: Allu Vs Mega War: అల్లు – మెగా ఫ్యామిలీ వార్ అస్థిత్వం కోసమేనా?
అమెరికాలో ప్రీమియర్స్ కోసం ‘సరిపోదా శనివారం’ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ బుకింగ్స్‌తో నానికి యూఎస్ ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రీసేల్స్‌లో ‘సరిపోదా శనివారం’ మూవీ ఇప్పటికే 200K డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు చిత్రబృందం వెల్లడించింది. సినిమా రిలీజ్‌కి సమయం ఉండటంతో, ఈ ప్రీసేల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో యూఎస్‌ఏ ప్రీమియర్స్‌లో శ్రీకాంత్ డైరెక్ట్ చేసిన రూరల్ డ్రామా దసరా రూ.5 కోట్లకుపైగా వసూళ్లు చేసింది. మీడియం రేంజ్ తెలుగు హీరోకు ఇది టాప్ ఫిగర్ అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. అయితే విడుదలకు మరో మూడు రోజులున్న నేపథ్యంలో దసరా మార్క్‌ను ‘సరిపోదా శనివారం’ చెరిపేయడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమాలో విలక్షణ నటుడు ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి జేక్స్ బిజాయ్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ‘సరిపోదా శనివారం’ చిత్రాన్ని డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.