ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. శతాబ్దంలోనే సుదీర్ఘమైన పాక్షిక చంద్రగహణం నవంబరు 19న కార్తిక పౌర్ణమి రోజు వినువీధిలో దర్శనమివ్వబోతుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ నాసా ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా నవంబరు 18, 19 తేదీల్లో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపించనుండగా.. భారతకాలమానం ప్రకారం నవంబరు 19న శనివారం మధ్యాహ్నం ఒకటిన్నరకు.. చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి ఒకే వరుసలో వచ్చి .. భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి […]
డేవిడ్ వార్నర్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎంత ప్రాధాన్యమిస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలో ఉంటే ఎంత విజృంభిస్తాడో.. బయట అంత ఉల్లాసంగా కనిపిస్తాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మ్యాచ్ ముగిసిన తర్వాత విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవోతో కలిసి డ్యాన్స్ చేయడం వైరల్‌గా మారింది. విండీతరపున ఆఖరి మ్యాచ్ ఆడిన బ్రావోకు రిటైర్మెంట్ వేళ గార్డ్ ఆఫ్ ఆనర్‌తో పాటు వార్నర్ డ్యాన్స్ అందరిని ఆకట్టుకుంది. ఇక విండీస్‌తో మ్యాచ్‌లో ఆసీస్ విజయంలో వార్నర్ కీలకపాత్ర పోషించాడు. […]
మన దేశంలో నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 10,853 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో 3,37,49, 900 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,44,845 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 260 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 4, […]
ఏపీ స్థానిక ఎన్నికల్లో మరో ప్రక్రియ ముగిసింది. ఇప్పటివరకు దాఖలైన నామినేషన్లు పరిశీలించిన ఎన్నికల అధికారులు.. సరైన ఫార్మాట్లో లేని వాటిని తిరస్కరించారు. తిరుపతి, నెల్లూరు, చిత్తూరుతో పాటు కొన్నిచోట్ల నామినేషన్ల తిరస్కరణ ఉద్రిక్తతలకు దారి తీసింది. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు.అభ్యర్థులు తమ నామినేషన్లను ఈ నెల 9వ తేదీలోపు ఉపసంహరించుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటల తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. నవంబర్ 14న […]
నేడు ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగంతో ప్రారంభమయ్యే బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంతో ముగియనుంది. పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. కోవిడ్19 నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యులందరినీ ఢిల్లీకి ఆహ్వానించలేదు. […]
ఇవాళ న్యూజిలాండ్‌పై అఫ్గానిస్తాన్ గెలుస్తుందా? భారత్ సెమీస్ ఆశలు నిలుస్తాయా? సగటు భారత అభిమాని ఇప్పుడు ఈ మ్యాచ్ ఫలితం కోసమే ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ కివీస్ చేతిలో అఫ్గాన్ ఓడితే టీమిండియా సెమీస్ అశలు గల్లంతైనట్లే. టీ-20 వరల్డ్ కప్‌లో భారత్ సెమీస్‌కు వెళ్లాలంటే ఇప్పుడు మరో ప్రత్యర్థి జట్టు గెలవాలనునే పరిస్థితి వచ్చింది. పాక్, కివీస్‌తో జరిగిన రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో భారత్ సమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ తరుణంలో అఫ్గాన్, స్కాట్లాండ్‌పై […]
టీ-20 వరల్డ్ కప్ సూపర్-12లో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో… వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌పై సౌతాఫ్రిక ఘన విజయం సాధించాయి. కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సత్తా చాటి సెమీస్‌లో అడుగు పెట్టగా.. నెట్‌రన్‌రేట్ కారణంగా సౌతాఫ్రిక ఇంటిదారి పట్టింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా రెండూ బలమైన జట్లే. ఐదు మ్యాచుల్లో నాలుగు గెలిచిన ఇరు జట్లలో.. ఒకే టీంకు మాత్రమే సెమీస్‌లో చోటు దక్కింది. సమాన విజయాలతో సెమీస్ కోసం బరిలోకి దిగిన రెండు జట్లు.. తమ ప్రత్యర్థి […]
మేషం :- స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు విశ్రాంతికై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయాలలో వారికి స్నేహ బృందాలు అధికమవుతాయి. గృహంలో ఏదైనా వస్తువు పోయే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. సంఘంలో మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. వృషభం :- ఆర్థిక లావాదేవీల్లో ఒత్తిడి, హడావిడి అధికంగా ఉంటాయి. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయొద్దు. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు కలిసిరాగలదు. ప్రత్యర్థులు మిత్రులుగామారి దైవకార్యాల్లో పాల్గొంటారు. ఏదైనా అమ్మకానికై […]
తూర్పుగోదావరి : ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ పరిపాలన నిరంతరాయంగా దశాబ్దాలపాటు సాగాలని… అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే రాష్ట్రం తలమానికంగా మారాలన్నారు ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పాదయాత్ర లో ఇచ్చిన హామీలను రెండేళ్లలోనే సి.ఎం. జగన్ అమలు చేశారని కొనియాడారు. కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకటేశ్వరస్వామిని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ… రాష్ట్రం సుభీక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని… వరాలు ఇచ్చే దేవుడు వాడపల్లి వెంకటేశ్వరస్వామి అని […]