టీ-20 వరల్డ్ కప్ సూపర్-12లో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో… వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌పై సౌతాఫ్రిక ఘన విజయం సాధించాయి. కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సత్తా చాటి సెమీస్‌లో అడుగు పెట్టగా.. నెట్‌రన్‌రేట్ కారణంగా సౌతాఫ్రిక ఇంటిదారి పట్టింది.
ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా రెండూ బలమైన జట్లే. ఐదు మ్యాచుల్లో నాలుగు గెలిచిన ఇరు జట్లలో.. ఒకే టీంకు మాత్రమే సెమీస్‌లో చోటు దక్కింది. సమాన విజయాలతో సెమీస్ కోసం బరిలోకి దిగిన రెండు జట్లు.. తమ ప్రత్యర్థి జట్లపై విజయం సాధించాయి. అయితే నెట్‌రన్‌రేట్ కారణంగా ఆస్ట్రేలియా సెమీస్‌కు దూసుకెళ్లింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై సౌతాఫ్రిక గెలుపొందింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.
డస్సెన్ 94 పరుగులు, మార్‌క్రమ్ 52 పరుగులతో రాణించారు. ఆరువాత 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. చివరి ఓవర్లో ఇంగ్లాండ్‌కు 14 పరుగులు అవసరం కాగా కేవలం మూడు పరుగులు మాత్రమే సాధించగలిగింది. రబాడ అద్భుతంగా బౌలింగ్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సత్తా చాటింది.
వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కీలక సమయాల్లో తానెంత ప్రమాదకరంగా ఆడతాడో మరోసారి డేవిడ్ వార్నర్ నిరూపించాడు. 89 పరుగులు చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం ఆసీస్ కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించిది. నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో ఆసీస్ సెమీస్‌లోకి అడుగు పెట్టింది.