రేపు మధ్యాహ్నం డాలర్ శేషాద్రి అంతిమ సంస్కారాలు జరుగనున్నాయని సమాచారం అందుతోంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు మార్గాన వైజాగ్ నుంచి తిరుపతికి డాలర్ శేషాద్రి పార్థివ దేహాన్ని తరలించనున్నారు. ఇక ఇవాళ అర్దరాత్రికి తిరుపతికి చేరుకోనుంది ఆయన పార్దివ దేహం. రేపు ఉదయం ప్రజల సందర్శనార్దం… తిరుపతిలోని సిరిగిరి అపార్ట్మెంట్ లో డాలర్ శేషాద్రి పార్థివ దేహాన్ని ఉంచేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇక రేపు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటలకు వరకు పూజలు […]
ఉస్మానియా వర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాలలో సమాధి కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం కాలేజీ హాస్టల్ వెనుక స్థలానికి వెళ్లిన కొందరు విద్యార్థులకు సమాధి కనిపించడంతో భయంతో హాస్టల్ కు పరుగులు తీశారు. అనంతరం.. ఈ విషయాన్ని తోటి విద్యార్థులకు చెప్పారు. అక్కడితో ఆగని ఆ విషయం… చీఫ్ వార్డెన్ దృష్టికి వెళ్లింది. సమాధిలో జంతువునా.. మనిషిని పూడ్చి పెట్టారా.. అనేది తెలియాల్సి ఉంది. సమాధిపై చల్లిన పూలు తాజాగా ఉండగా… ఇటీవలే తవ్వి పూడ్చినట్లుగా ఆ సమాధి […]
మన దేశంలో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో దేశంలో 8,309 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 236 మంది మృతి చెందారు. దేశంతో మొత్తం ఇప్పటి వరకు 3,40,08,183 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 4,68,790 మంది మృతి చెందారు. దేశంలో 1,03,859 […]
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ ప్రతి మూడు నెలల కోసారి.. కొత్త రూపంతరం చెంది… ప్రజలను కబలిస్తోంది. అయితే.. ప్రస్తుతం ఈ వైరస్ ఓమిక్రాన్ రూపంలో వచ్చి.. అందరినీ వణికిస్తుంది. అయితే… ఈ ఓమిక్రాన్ అంటే… ఏమిటి ? దీని లక్షణాలు ఏంటి ? ఎలా సోకుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 1 . ఇది కొత్త కరోనా రకం . ఇది మన దేశం […]
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న ఏపీ పర్యటనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు. ‘మనిషివా చంద్రబాబు’ అనే పరిస్థితి తెచ్చుకున్నాడంటూ చంద్రబాబు కు చురకలు అంటించారు విజయసాయిరెడ్డి. ”గాల్లో కలిసిపోతారని సీఎం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు వక్రబుద్ధి ప్రజలు అధఃపాతాళానికి తొక్కేసినా మారలేదు. వరద ప్రాంతాల పర్యటనలో తన భార్య గురించి మాట్లాడి ‘మనిషివా చంద్రబాబు’ అనే పరిస్థితి తెచ్చుకున్నాడు. తానే బాధల్లో ఉన్నానని, […]
మొత్తానికి పెట్రోల్ ధరలను టమాటా దాటేసింది. ఇది సామాన్యుడి నిత్యావసరం. ఏదో ఒక రకంగా ఏ వంటకంలో అయినా టమాటా ఉండాల్సిందే. ఐతే ఇప్పుడు చాలా వాటిలో కనిపించట్లేదు. పప్పు చారు..సాంబారు మాత్రమే కాదు ఇడ్లీ చట్నీల్లో కూడా పత్తా లేదు. దేశంలో కూరగాయల ధరలకు ఈ పరిస్థితి అద్దం పడుతోంది. నిన్న మొన్నటి వరకు కిలో 20 రూపాయలున్న టమాటా ధర ఉన్నట్టుంది వంద దాటేసింది. సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో […]
సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తే హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని… మెట్రో రైల్ విషయం లో గతంలోనే చేసుకున్న ఒప్పందాల కు విరుద్ధంగా ఎల్ అండ్ టీ వ్యవహరించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు మోడీ ఫొటో పెట్టక పోవడానికి కారణం రాజకీయాలేనని… రెండేళ్ల కదా ఈ(కేసీఆర్) ప్రభుత్వం ఉండేదని వెల్లడించారు. హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధి కోసం […]
ఆ ఎమ్మెల్యే తీరు చూసి జనం నోరెళ్లబెడుతున్నారు. మొదటి సారి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వెంటనే ఎమ్మెల్యేగా గెలవటమే కాదు….రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించిన ఘనత ఆయనకే దక్కింది. ఎన్నికల ముందేమో అందర్నీ అన్నా అని ఆప్యాయంగా పలకరించినా, ఆ ఎమ్మెల్యే మాటల్లో ఇప్పుడు ఆ మర్యాద కనపడకపోవడంతో…. అప్పుడలా.. ఇప్పుడిలా అని నేతలు గుసగుసలాడుతున్నారట. కడపజిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం రాజకీయ పరంగా రాష్ట్రంలో గుర్తింపు కలిగిన నియోజకవర్గం. రూపాయికి బొమ్మా బొరుసు ఉన్నట్లు జమ్మలమడుగు రాజకీయాలలో […]
ఎవరికైనా ఓకే కులం ఉంటుంది. కానీ, ఆ నేతకు రకరకాల కులాలు ఉంటాయి. ఆయన ఉన్న చోట పదవులు ఏ కులానికి రిజర్వ్ అయితే, ఆయనా అదే కులానికి మారిపోతారు. వివిధ కులాల పేర్లతో పదవులు పొందిన ఆ నేత తాజాగా ఇంకో కులం కోటాలో ఏకంగా ఎమ్మెల్సీ ఛాన్స్ కొట్టేశారు. ఇంతకీ ఎవరా నేత? ఏమా కత? ఆ నేతకు తన కులంపై క్లారిటీ లేదట. ఆయనిప్పుడు కాపు కోటాలో ఎమ్మెల్సీ అవుతున్నారు. రిజర్వేషన్లకు అనుకూలంగా […]