అప్పట్లో అన్న… ఇపుడు ఒరేయ్… ఆ నాయకుడి మాటల్లో మార్పు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ ఎమ్మెల్యే తీరు చూసి జనం నోరెళ్లబెడుతున్నారు. మొదటి సారి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వెంటనే ఎమ్మెల్యేగా గెలవటమే కాదు….రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించిన ఘనత ఆయనకే దక్కింది. ఎన్నికల ముందేమో అందర్నీ అన్నా అని ఆప్యాయంగా పలకరించినా, ఆ ఎమ్మెల్యే మాటల్లో ఇప్పుడు ఆ మర్యాద కనపడకపోవడంతో…. అప్పుడలా.. ఇప్పుడిలా అని నేతలు గుసగుసలాడుతున్నారట.
కడపజిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం రాజకీయ పరంగా రాష్ట్రంలో గుర్తింపు కలిగిన నియోజకవర్గం. రూపాయికి బొమ్మా బొరుసు ఉన్నట్లు జమ్మలమడుగు రాజకీయాలలో మాజీ మంత్రులు ఆది నారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి లు ఉండేవారు. అయితే ఇప్పుడదంతా గతం… నిన్నమొన్నటి వరకు ఆయన పేరు సరిగ్గా చాలా మంది ప్రజలకు కూడా తెలియదు. వైద్యవృత్తిలో ఉంటూ రాజకీయాలలోకి అడుగుపెట్టారు డాక్టర్ సుధీర్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ లో సీనియర్ నాయకుడిగా ఉంటూ, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర హోం మంత్రి గా చేసి ఒక వెలుగు వెలిగిన మైసూరారెడ్డి సోదరుడి కుమారుడే సుధీర్ రెడ్డి.
Also Read
2017 సంవత్సరంలో జమ్మలమడుగు లో రాజకీయంగా మార్పులు జరిగాయి. వైసీపీ నుంచి MLA గా గెలుపొందిన ఆదినారాయణ రెడ్డి అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ సమయంలో రాజకీయాల్లోకి ఎంటరయ్యారు సుధీర్ రెడ్డి. నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న నాయకత్వ బాధ్యతలను రాజకీయాలకు కొత్తైనా సుధీర్ రెడ్డికి అప్పగించారు జగన్. నియోజకవర్గానికి కొత్త వ్యక్తి అయిన సుధీర్ రెడ్డి వస్తూ వస్తూనే అందర్నీ అన్నా…మామా.. బాబాయ్.. తమ్ముడూ అంటూ వరుసలు కలిపేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరితో కలిసిమెలిసిపోయారు. అప్పటికే నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి జోరుమీదుండటంతో, ఎమ్మెల్యే మర్యాద పిలుపులు కలిసివచ్చి, తక్కువ కాలంలోనే జనంతో కలిసిపోయారు.
కాలం కలిసిరావడంతో కడపజిల్లా లోని మెజారిటీలో ముఖ్యమంత్రి జగన్ తరువాత అధిక మెజారిటీ సుధీర్ రెడ్డి దక్కించుకున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ MLA సుధీర్ మాట తీరులో చాలా మార్పు వచ్చిందని సన్నిహితులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికలకు ముందేమో అన్నా అని ఆప్యాయంగా పలకరించిన సుధీర్ రెడ్డి ఈ మధ్య అరేయ్, ఒరేయ్ అంటూ సంభోదిస్తున్నాడని సమాచారం. కనీసం ద్వితీయ శ్రేణి నాయకులకు చిన్న చిన్న పనులు కూడా చేయటం లేదని పనుల సంగతి అటుంచితే కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదని బాధపడటం నాయకుల వంతైంది.
ఇప్పటికే ఎమ్మెల్యే తీరుపై రకరకాలుగా విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా కేడర్ తో ప్రవర్తిస్తున్న తీరుకు నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎమ్మెల్యే ఎందుకిలా చేస్తున్నారో తెలియక తల పట్టుకుంటున్నారు.
తాజావార్తలు
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?