ఓమిక్రాన్ వైరస్ లక్షణాలు ఇవే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ ప్రతి మూడు నెలల కోసారి.. కొత్త రూపంతరం చెంది… ప్రజలను కబలిస్తోంది. అయితే.. ప్రస్తుతం ఈ వైరస్ ఓమిక్రాన్ రూపంలో వచ్చి.. అందరినీ వణికిస్తుంది. అయితే… ఈ ఓమిక్రాన్ అంటే… ఏమిటి ? దీని లక్షణాలు ఏంటి ? ఎలా సోకుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
1 . ఇది కొత్త కరోనా రకం . ఇది మన దేశం లో రెండో వేవ్ { మార్చ్ – మే 2021 } కి కారణం అయిన డెల్టా వైరస్ కంటే ఆరు రెట్లు ఎక్కువ వేగం గా విస్తరిస్తుంది . డెల్టా మార్చ్ లో మన దేశం తో మొదలై అక్టోబర్ నాటికి ప్రపంచం లోని అన్ని దేశాలను చుట్టేసింది . డెల్టా కంటే ఆరు రెట్లు ఎక్కువ వేగం అంటే ఓమిక్రాన్ ను నిలువరించడం అసాధ్యం . కట్టడి చర్యలు అనేది వినడానికి బాగుంటాయి . వాస్తవంగా, అందునా జనాభా ఎక్కువ ఉన్న భారత దేశం లో అసాధ్యం .
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
2 . ఓమిక్రాన్ దక్షిణాఫ్రికా దేశం లో ముందుగా గుర్తించారు . ఆస్ట్రేలియా , ఇటలీ , జర్మనీ , నెథర్లాండ్ , బ్రిటన్ , ఇజ్రాయెల్, హాంగ్ కాంగ్ , బోట్స్వానా , బెల్జియం దేశాల్లో ఇది ఇప్పటికే వుంది .
౩. ఓమిక్రాన్ సోకిన వారు కనబరిచే లక్షణాలు : 1 బాగా అలసట గా ఉండడం , కొద్ది పాటి కండరాల నొప్పి , గొంతులో కొద్ది పాటి గరగర , పొడి దగ్గు . తక్కువ మందిలో కొద్ది పాటి జ్వరం . చికెన్ గున్యా కు దీనికి చాలా మాటకు ఒకటే లక్షణాలు .
4 . ఎవరికి సోకుతుంది ?
మొదటి వేవ్ లో కరోనా బారిన పడిన వారికి సోకవచ్చు . వారి ఇమ్మ్యూనిటి బాగా దెబ్బ తినే ఉంటే తప్పించి వారి పై దీని ప్రభావము అత్యంత స్వల్పం . అసలు వచ్చినట్టే తెలియదు . ఇప్పటిదాకా కరోనా సోకకుండా , వాక్సిన్ రెండు డోసులు తీసుకొన్న వారికి సోక వచ్చు . రెండు రోజులు అలసట , పొడి దగ్గు , 101 డిగ్రీలు దాటని జ్వరం తో ఇది పోతుంది . ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉండదు . రెండో వేవ్ లో డెల్టా సోకిన వారికి ఇది సోకే అవకాశం బాగా తక్కువ తక్కువ . సోకినా వారికే అర్థం కాకుండా అంటే ఎలాంటి లక్షణాలు లేకుండా పోతుంది . ఇప్పటిదాకా కరోనా బారిన పడకుండా అంతే కాకుండా వాక్సిన్ వేసుకోకుండా ఉన్న వారికి ఇది సోకుతుంది . వారి ఇమ్మ్యూనిటి బాగుంటే కోలుకొంటారు .
5 . ఎవరికి డేంజర్? : భయపడే వార్తలను పదేపదే చదివే వారికి, వినేవారికి డేంజర్ . వారి భయమే వారి పాలిట శాపంగా మారుతుంది . ఓమిక్రాన్ చంపదు. భయం ముంచేస్తుంది . ముందుగా ఆల్ఫా వైరస్ వచ్చింది . అటుపై దాని కంటే అనేక రెట్ల వేగం తో విస్తరించే డెల్టా వచ్చింది . ఇప్పుడు అంతకంటే ఎక్కువ వేగంతో ఓమిక్రాన్ . కట్టడి చర్యల పేరుతొ మీ భయాన్ని మార్కెటింగ్ చేసుకొనే ప్రయత్నాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి . కరోనా ను నుంచి ముక్కున్న మానవుడు తప్పించుకోలేడు అని నేను ప్రారంభం నుంచి చెబుతున్నాను . కరోనా పోతుంది అని ఇంకా నమ్మే అమాయక ప్రజలు కోకొల్లలుగా వున్నారు . కరోనా ఎక్కడికీ పోదు . మరో వంద ఏళ్ళైనా ఉంటుంది . మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో స్పానిష్ ఫ్లూ కలుగ చేసిన వైరస్ ఇంకా మన మధ్యే వుంది . అది సాధారణ జలుబు కలుగ చేస్తుంది . మొదటి ప్రపంచ యుద్ధ కాలం లో అది ప్రాణాంతకం అయిన మాట వాస్తవం . కానీ మ్యుటేషన్ లు జరిగే కొద్దీ బలహీన పడి జలుబు ఫ్లూ వైరస్ గా నిలిచిపోయింది . కరోనా కూడా అంతే .. ఒళ్ళు నొప్పుల వైరస్ గానో మరో స్వల్ప లక్షణాలు కలుగచేసే వైరస్ గా నో స్థిరపడి పోతుంది . మీ జీవిత కాలం లో ఎన్నో సార్లు సోకుతుంది . సోకినా ఏమీ కాదు . భయపడే వ్యక్తిని ఎవరూ రక్షించలేరు .
6 . ఓమిక్రాన్ కు మోనోక్లోనల్ యాంటీబోడీ కాక్టెయిల్ పనిచేసే అవకాశం తక్కువ . విపరీతంగా భయపడే వారు , లేదా ఇమ్మ్యూనిటీ మరీ బలహీనంగా ఉన్న వారు తప్పించి మిగతా వారికి దీని అవసరం రాదు .
7 . మ్యుటేషన్ ల కు గురికావడం సూక్షజీవుల లక్షణం . { ఆ మాటకు వస్తే అన్ని జీవులు . కాకపోతే సూక్షజీవుల పై ప్రభావం ఎక్కువ } . ఓమిక్రాన్ రేపు మరో రూపం లో కి మారొచ్చు . దాన్ని ఆపలేము . దాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదు . మన ఇమ్మ్యూనిటి నే మనకు రక్ష. ప్రతి రోజు కనీసం అరగంట ఎండ లో నడవండి . శరీరానికి డి విటమిన్ అందివ్వండి . శాఖాహారులు బి 12 విటమిన్ మాత్రలు తీసుకోండి . తినే ఆహారం లో ప్రోటీన్ లు ఎక్కువగా { కనీసం ముప్పై శాతం } ఉండేలా చూసుకోండి . పన్నీర్ , మొలికెత్తిన పెసలు , పుట్టగొడుగులు , బ్రోకలీ , జామ కాయ , చికెన్ , ఫిష్ మటన్ , గుడ్డు ప్రోటీన్ అందించే ఆహార పదార్తాలు . రోజుకు పెద్దలు నాలుగు లీటర్ల నీరు తాగాలి . చెమట పట్టేదాకా వ్యాయామం { కనీసం నడక } చెయ్యాలి . శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వాలి . నిద్ర బాగా పోవాలి.
ఇవన్నీ ఇమ్మ్యూనిటి ని బలపరుచుకొనే మార్గాలు. అన్నింటికన్నా భయం పెద్ద విలన్ .. భయం ఇమ్మ్యూనిటి ని చంపేస్తుంది . అదే ఫార్మసురుల అస్రం. భయం తో మళ్ళీ మీ ఆస్తులు ఖాళీ చేసి వారి గోదాముల్లో నోట్ల కట్టలు సంచుల్లో దాచుకొనే అవకాశాన్ని కల్పించుకొంటున్నారు . తస్మాత్ జాగ్రత్త.
వేవ్ అంటే ఆసుపత్రిల్లో బెడ్ లు దొరకపోవడం , అంబులెన్సు ల క్యూలు .. ఇలాంటి స్థితి రాదు . కానీ మన దేశం లో కరోనా అంటే భయపడే వారు కోకొల్లలుగా వున్నారు . ఇన్నాళ్లయినా నిజాన్ని గ్రహించలేని వారు , భయం వద్దని చెబితే మొండిగా, మూర్ఖంగా వాదించేవారు వున్నారు . వారిని ఓమిక్రాన్ నుంచి ఎవరూ రక్షించలేరు . తత్త్వం బోధపడేటప్పటికీ వారు ఉండక పోవచ్చు .. ఉన్నా ఆస్తులు పోగొట్టుకొని అనారోగ్యం తో .. ఇలా చెబుతున్నందుకు సారీ . నిజం నిష్టూరంగా ఉంటుంది . తప్పదు . భయాన్ని బహిష్కరించండి . నిర్భయంగా వుండండి . అప్రమత్తత అవసరం . అలసట అనిపిస్తే పల్స్ ఆక్సీ మీటర్ లో ఆక్సిజన్ శాతం వారం రోజుల పాటు రోజుకు ఒక సారి చెక్ చేసుకోండి . అది 94 పైగా ఉంటే హ్యాపీగా గా కాలం గడపండి.
- వాసిరెడ్డి అమర్‌నాథ్
తాజావార్తలు
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!