శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రి కారణంగా ఓ కరోనా రోగి మరణించింది. అసలు వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలోని పెంట ఆగ్రహారం గ్రామానికి చెందిన కరోనాతో బాధపడుతోంది. వైద్యం కోసం ఆమెను కుటుంబ సభ్యులు బుధవారం రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకోచ్చారు. రోగికి ఆరోగ్య శ్రీ వర్తించకపోవడంతో ముందుగా డబ్బు చెల్లించాలని ఆస్పత్రి యాజమాన్యం చెప్పింది. అయితే డబ్బు రూపంలో మాత్రమే ఫీజు చెల్లించాలని, ఆన్లైన్ పేమెంట్స్ అంగీకరించబోమని ఆస్పత్రి […]
తెలంగాణ సిఎం కెసిఆర్ కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సీఎం కేసీఆర్ కు నిన్న నిర్వహించిన యాంటీజన్, ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. మొన్నటి యాంటీజన్ టెస్ట్ రిపోర్ట్ లో నెగెటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్ట్ లో కచ్చితమైన ఫలితం రాలేదని సీఎం వ్యక్తిగత వైద్యులు ఎం.వీ రావు తెలిపారు. వైరస్ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి కచ్చితమైన ఫలితాలు రావని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ […]
సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులను కోల్పోయిన సినీ పరిశ్రమ.. తాజాగా మరో దర్శకున్ని కోల్పోయింది. టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ దర్శకుడు కెవి ఆనంద్ మృతి చెందారు. ఇవాళ ఉదయం 3:30 సమయంలో హార్ట్ ఎటాక్ కారణంగా ఆయన మరణించారు. ఒక్క క్షణం, ఎక్కడికి పొతావు చిన్న వాడా, డిస్కో రాజా లాంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించారు కెవి ఆనంద్. కెవి ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన […]
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టీం ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. కరోనా సెకండ్ వేవ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ ప్రాణాంతక వైరస్ వల్ల ఆక్సిజన్ కొరతతో బాధ పడుతున్న వారికి సహాయం చేసేందుకు మిషన్ ఆక్సిజన్ అనే సంస్థకు తన వంతుగా కోటి రూపాయలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ విషయాన్ని స్వయంగా సచిన్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. 250 మందికి పైగా యువకులతో మిషన్ […]
టిడిపి అధినేత చంద్రబాబుపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో చంద్రబాబుకు చిప్పకూడు ఖాయమని..చంద్రబాబుకు ముని శాపం ఉంది నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నాయకులు అందరూ దొంగలే అయినా దొరలాగా తిరిగారని..చంద్రబాబు నాయుడి, అచ్చెం నాయుడు, దేవినేని ఉమకు త్వరలో జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. హెరిటేజ్ కోసం చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న పాలడెయిరీలు అన్నిటిని నిర్వీర్యం చేసాడని… సంగం డైరీ ఎవడబ్బ సొత్తు […]
ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి. పరీక్షలను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే.. ఎలాగైనా నిర్వహిస్తామని ఏపీ సర్కార్ అంటోంది. ఈ నేపథ్యంలో ఏపీ పది, ఇంటర్ పరీక్షలపై హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని, ఇది లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశామని హై కోర్టు పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఏపీ సర్కార్ పునరాలోచించాలని తెలిపింది. పక్క రాష్ట్రాలలో పరీక్షలు వాయిదా వేస్తే.. […]
కరోనా కారణంగా 15 మంది టిటిడి ఉద్యోగులు మృతి చెందారని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుమలలో విధులు నిర్వహిస్తునందు వలన వైరస్ సోకడం లేదని.. టిటిడి ఉద్యోగులు అందరికి యుద్ద ప్రాతిపాదికన వ్యాక్సినేషన్ చేయిస్తామని తెలిపారు. ఉద్యోగులు తిరుపతిలో నివసిస్తుండటం కారణంగా వైరస్ వ్యాపిస్తోందని పేర్కొన్నారు. బర్డ్ హస్పిటల్స్ లో ఉద్యోగులుకు ప్రత్యేకంగా కోవిడ్ చికిత్స అందిస్తామని..గోవు ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన బియ్యంతో స్వామివారికి నైవేద్యం సమర్పణ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఏడాది […]
తెలంగాణ సర్కార్ పై మరోసారి టీఎస్ హైకోర్టు అసంతృప్తిని వ్యక్త పరిచింది. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ నేటితో ముగుస్తుంది.. అయినా ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్త పరిచింది. ఉదయమే కేసు ఉన్నా మధ్యాహ్నం వరకు సమయం కోరిన ప్రభుత్వం.. మధ్యాహ్నం తర్వాత కూడా నిర్ణయం వెల్లడించలేదు అడ్వాకేట్ జనరల్. మీరు నిర్ణయం తీసుకోకపోతే మేమే ఆదేశాలు ఇస్తామన్న హైకోర్టు..నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు అని ప్రశ్నించింది. సరైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు ఏజీ. […]
ఏపీలో 15 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 74748 మందిని టెస్ట్ చేస్తే 14669 కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. అలాగే 24 గంటల్లో 71 మరణాలు సంభవించాయని ఆయన పేర్కొన్నారు. ఒకట్రోండు రోజుల్లో ట్రూనాట్ టెస్టులు చేపడతామని… కోవిడ్ చికిత్స కోసం 422 ఆస్పత్రులకు అనుమతించామన్నారు. 5572 ఐసీయూ బెడ్లల్లో 2570 బెడ్లు ఖాళీగా ఉన్నాయని..ఆక్సిజన్ బెడ్లు 7744 బెడ్లు అందుబాటులో […]
కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ సిఎం కెసిఆర్ కొలుకున్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవి రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం.. సీఎం కెసిఆర్ కు ఇవాళ తన వ్యవసాయ క్షేత్రంలో కొవిడ్ పరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసియార్ పరీక్షలు నిర్వహించారు. యాంటిజెన్ టెస్టులో సిఎం కెసిఆర్ కు కరోనా నెగిటివ్ వచ్చింది. ఇక ఆర్టీపీసియార్ పరీక్షా ఫలితాలు రేపు రానున్నాయి. కాగా సిఎం కెసిఆర్ […]