సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులను కోల్పోయిన సినీ పరిశ్రమ.. తాజాగా మరో దర్శకున్ని కోల్పోయింది. టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ దర్శకుడు కెవి ఆనంద్ మృతి చెందారు. ఇవాళ ఉదయం 3:30 సమయంలో హార్ట్ ఎటాక్ కారణంగా ఆయన మరణించారు. ఒక్క క్షణం, ఎక్కడికి పొతావు చిన్న వాడా, డిస్కో రాజా లాంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించారు కెవి ఆనంద్. కెవి ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన కో (రంగం), అయాన్ (వీడొక్కడే) మూవీస్ పెద్ద హిట్ అయ్యాయి. కాగా.. కెవి ఆనంద్ మృతితో తెలుగు, తమిళ పరిశ్రమ తీవ్ర విషాదంలోకి వెళ్ళింది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. జర్నలిస్టు గా తన కెరీర్ ప్రారంభించిన ఆయన..మంచి స్థాయికి ఎదిగారని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు.