ఏపీలో కోవిడ్ పరిస్థితులు, ప్రభుత్వ చర్యలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్బంగా ఏపీలో కోవిడ్ పరిస్థితులపై ఎమికస్ క్యూరీ ఏర్పాటుకు అదేశాలు ఇచ్చింది హైకోర్టు. గంటన్నర పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆక్సిజన్, బెడ్లు, టెస్టులు, రిపోర్టులు, డ్రగ్స్, వ్యాక్సినేషన్ పై సమగ్ర వివరాలతో అఫిడవిట్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆక్సిజన్ నిల్వలు ఎలా ఉన్నాయి, ఎంత మేరకు సరిపోతాయి, ఏయే పాయింట్స్ నుంచి ఎంత ఉత్పత్తి చేస్తున్నారని […]
ఈటల రాజేందర్ పై మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ మేకవన్నె పులి… ఈటల రాజేందర్ పచ్చి అబద్ధాల కోరని మండిపడ్డారు. బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల అని మంత్రి గంగుల ఫైర్ అయ్యారు.ఈటల రాజేందర్ కు సీఎం కేసీఆర్ ను విమర్శించే స్థాయి ఉందా?.. ఈటల టీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఉన్నపుడు ఆ పదవిని దుర్వినియోగం చేశారని నిప్పులు చెరిగారు. బీసీలను దగ్గరకు రానీయలేదు.. ఈటల వ్యాపార భాగస్వామ్యులు […]
మంగళగిరి సిఐడి కార్యాలయమలో మూడోసారి విచారణకు మాజీమంత్రి దేవినేని ఉమా హజరయ్యారు. ఈ సందర్బంగా దేవినేని ఉమా మాట్లాడారు. రెండు రోజుల పాటు రోజుకు 9 గంటల పాటు విచారణ చేశారని..మళ్లీ మూడో రోజు విచారణకు రావాలని పిలిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానంద హత్య కేసులో విజయసాయిరెడ్డిని, సాక్షి కొమ్మినేని శ్రీనివాసరావును విచారణ జరిపితే ఈపాటికి నిజాలు తెలిసేవని.. 41 క్రింది నాకు హైకోర్టు బెనిఫిట్స్ ఇస్తే అధికారులు దాన్ని కాల రాస్తున్నారని ఫైర్ […]
తిరుమల టీటీడీలో మరో వివాదం చోటు చేసుకుంది. తనకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితులు. గొల్లపల్లి వంశం నుంచి తాను ప్రధాన అర్చకుడిగా కొనసాగుతుండగా తమ కుటుంబం నుంచే రమణదీక్షితులను ప్రధాన అర్చకుడిగా నియమించడాన్ని హైకోర్టులో సవాలు చేశారు వేణుగోపాలదీక్షితులు. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ, రమణదీక్షితులను పేర్కొన్నారు వేణుగోపాలదీక్షితులు. అయితే ఈ ఫిల్ ను స్వీకరించి ప్రభుత్వం, టీటీడీ, రమణదీక్షితులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. శ్రీవారి ఆలయ […]
ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అయితే ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరుగనుంది. ముఖ్యంగా వైఎస్సార్ రైతు భరోసా పథకానికి ఆమోదం తెలుపనున్న కేబినెట్..రైతు భరోసా కోసం 3 వేల 30 కోట్లకు ఆమోదం తెలుపనుంది. అలాగే వైఎస్సార్ ఉచిత భీమా పథకానికి ఆమోదం తెలుపనున్న కేబినెట్.. 2,589 కోట్లతో వైఎస్సార్ ఉచిత భీమా పథకం అమలు చేయనుంది. వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకానికి ఆమోదం తెలపనున్న కేబినెట్.. మత్స్యకారులకు 10 […]
ఐపీఎల్ నిరవధిక వాయిదా పడింది. నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటన చేసింది. వారం తర్వాత ఐపీఎల్ పై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. ఆటగాళ్లకు కరోనా సోకుతుండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలుగురు ప్లేయర్లు, కోచ్ లు కరోనా బారిన పడ్డారు. అటు ఇవాళ సన్ రిజర్స్ ఆటగాడు వృద్ధమన్ సాహాకు కూడా కరోనా సోకింది. ఇది ఇలా ఉండగా ఇద్దరు కోలకతా ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో నిన్న జరగాల్సిన కేకేఆర్, […]
పెళ్లి పేరుతో ఓ యువతిని 10 లక్షల 50 వేలు రూపాయలు మోసం చేశాడు ఓ ఘరానా మోసగాడు. అసలు వివరాల్లోకి వెళితే.. తెలుగు మ్యాట్రిమోనీలో హైదరాబాద్ బేగంపేటకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని తన ప్రొఫైల్ ను మ్యాట్రిమోనీ లో అప్డేట్ చేసింది. అయితే మునగర్స్ మేహుల్ కుమార్ అనే వ్యక్తి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పని చేస్తున్నాను అని ఆ యువతిని మోసం చేశాడు. ప్రొఫైల్ నచ్చిందని, వివాహం చేసుకోవడానికి అంగీకారమే […]
ఏపీలో కోవిడ్–19 నియంత్రణ కోసం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌పై సమీక్షలో సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీలో ఎల్లుండి (బుధవారం) నుంచి ఆంక్షలు మొదలు కానున్నాయి. బుధవారం నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు కానుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అన్ని షాపులు ఓపెన్ ఉంటాయని.. ఆ తర్వాత అత్యవసర సేవలు మాత్రమే నడువనున్నాయి. రెండు వారాల పాటు […]
క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తిరుపతి ఎంపిగా ఎన్నికైన డాక్టర్ ఎం. గురుమూర్తి మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్బంగా డా. గురుమూర్తి మాట్లాడుతూ.. తిరుపతి గెలుపు చాలా ఆనందం ఇచ్చిందని.. ప్రజలందరూ వైసీపీ వైపు ఉన్నారని మరో సారి స్పష్టం అయ్యిందని తిరుపతి ఎంపిగా ఎన్నికైన డా. గురుమూర్తి అన్నారు. ప్రభుత్వం ప్రవేశ పడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని.. అందుకే ఇంతటి గెలుపు సాధ్యం అయ్యిందని పేర్కొన్నారు. ప్రజలందరికీ తన […]
ఐపీఎల్ సీజన్ 14 పై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. ఇద్దరు కోలకతా ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో ఇవాళ జరగాల్సిన కేకేఆర్, ఆర్సీబీ 30 వ మ్యాచ్ ను వాయిదా వేశారు. వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే రోజు కరోనా నివారణ, ఆక్సిజన్ ల కోసం తమ వంతు సాయంగా విరాళాలు సేకరిస్తూ బెంగుళూర్ జట్టు బ్లూ జెర్సీ తో బరిలోకి దిగేందుకు […]