తెలంగాణ రాష్ట్రంలో కరోనా పూర్తిగా అదుపులోకిరాని ఏడు నియోజకవర్గాలలో లాక్ డౌన్ ను యథాతథంగా అమలు చేయాలని కెసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ, నియోజకవర్గాల పరిధిలో మాత్రం, లాక్ డౌన్ ఇప్పుడు కొనసాగుతున్న యథాతధ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉదయం 6 గంటల నుంచి పగలు 1 గంటల వరకు లాక్‌డౌన్ సడలింపు ఉంటుంది. కరోనా పరిస్థిని తెలుసుకునేందుకు […]
లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ కేబినెట్… ఇవాళ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్.. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్, సడలింపులు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ప్రస్తుత లాక్‌డౌన్ ఈ నెల 9వ తేదీతో ముగియనుండగా.. మరో 10 రోజుల పాటు పొడిగించారు.. ఇదే సమయంలో.. సడలింపులు సమయాన్ని పెంచుతూ.. లాక్‌డౌన్ సమయాన్ని కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. కేబినెట్ తాజా నిర్ణయం ప్రకారం.. ఈ నెల 10వ తేదీ […]
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల భగత్ సింగ్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. కన్న కుమారుడిని కొట్టి చంపింది ఓ తల్లి. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సొంత కొడుకునే చంపింది. అసలు వివరాల్లోకి వెళితే.. గత రెండేళ్లుగా భర్త సురేష్ ను కాదని మరో వ్యక్తితో భగత్ సింగ్ నగర్లో నివాసం ఉంటుంది తల్లి ఉదయ. అయితే భర్త సురేష్ పై కోపంతో ఇవాళ ఉదయం బాలుడు ఉమేష్ ను తీవ్రంగా కొట్టింది తల్లి ఉదయ. […]
కరోనా వైరస్ మన దేశంలో విలయం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, అధికారులు, మృతి చెందుతున్నారు. అయితే ఇటీవల సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ అంజయ్య కరోనాతో మృతి చెందారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. తన మంచి మనసును చాటుకున్నారు. కరోనాతో మరణించిన సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ అంజయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈరోజు అంజయ్య కుటుంబం […]
ఏపీ సర్కార్ పై టిడిపి నేత నారా లోకేష్ మరోసారి ఫైర్ అయ్యారు. అధికారం అండతో వైసీపీ పార్టీ హత్యారాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మలకాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గోపాల్ ను వైసీపీ నేతలు పాశవికంగా హత్య చేశారని లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. టిడిపి ప్రభుత్వం హయాంలో రాష్ట్రమంతా అభివృద్ధి-సంక్షేమం కనిపించేదని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. వైసీపీ రెండేళ్ల పాలనలో హత్యలు, దోపిడీలు, అరాచకాలే కనిపిస్తోన్నాయని […]
సిఎం కెసిఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి నుండి కాపాడేందుకు వాక్సిన్ తయారీలో మోడీ చూపించిన చొరవ అభినందనీయమన్నారు. స్వదేశీ కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేయకుండా ఉంటే లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చేదని…రాబోయే రోజుల్లో వాక్సినేషన్ లో అగ్రస్థానంలోకి మన దేశం రానుందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలు మోడీకి కృతజ్ఞతలు తెలిపారని..తెలంగాణ సీఎం కెసిఆర్ మాత్రం స్పందించలేదని…ఆయనొక సంస్కార హీనుడని మండిపడ్డారు. రూ. […]
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టినట్లు కనిపిస్తోంది. నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు తగ్గాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 7796 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,68,112 కు చేరింది. ఇందులో 16,48,895 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,07,588 కేసులు యాక్టివ్ గా […]
టిడిపి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు దోచుకోవడం తప్ప వేరే ఎజెండానే లేదని..అందుకే ప్రజలు ఈడ్చి కొట్టారని చురకలు అంటించారు. చంద్రబాబు ఇంకో ఐదేళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అయ్యేదన్నారు. “ప్రజలు ఈడ్చి కొట్టారు కాబట్టి సరిపోయింది. బాబు ఇంకో ఐదేళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అయ్యేది. ఇసుక మాఫియా, మైనింగ్, నీరు-చెట్టు నిధుల్ని బొక్కే మాఫియా, హెరిటేజ్ […]
ప్రధాని మోడీపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు బిజేపి నేత విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. కోవిడ్ వ్యాక్సిన్ కొరత 135 కోట్ల పైన జనాభా ఉన్నప్పుడు సహజం ఒవైసీ జీ.. ప్రపంచం మొత్తం కూడా చాలావరకు ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయని చురకలు అంటించారు విజయశాంతి. “2020 జూలై లో ఎక్కడ ఆమోదించబడ్డ వ్యాక్సిన్ కు, ఎవరికి ఆర్డర్ ఇచ్చి ఉండాలి..? ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలన్న నీతి సూత్రం మీ సయామీ ట్విన్ పార్టీ TRS […]
పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్ ను ఫణంగా పెట్టి రాజకీయం చెయ్యాలనుకుంటే అంతకంటే దుర్మార్గం ఉండదని..విద్యార్థుల ఆరోగ్యం, వారి భద్రత ప్రభుత్వానికి ముఖ్యమని పేర్కొన్నారు. పరిస్థితులు అనుకూలించిన తరువాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని.. పరీక్షలు ఎప్పుడు పెడతామనేది సరైన సమయంలో చెబుతామన్నారు. నారా లోకేష్ కు దొరికినట్టు అందరికీ సత్యం రామలింగరాజులు […]