ఏపీకి మరో 9 లక్షల కొవిడ్ టీకా డోసులు తరలివచ్చాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి కొవిషీల్డ్ టీకా డోసులు. దిల్లీ నుంచి చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలో 75 బాక్సుల్లో టీకా డోసులు రాష్ట్రానికి తరలివచ్చాయి. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్ ను తరలించారు అధికారులు.. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలివెళ్లనుంది వ్యాక్సిన్.. తాజాగా చేరుకున్న కొవిడ్ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ […]
ఏపీలో ఇంటర్, టెన్త్ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై విద్యార్థులలో గందరగోళ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి జగన్ విద్యా శాఖలో నాడు-నేడు అనే కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణపై క్లారిటీ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సారి కూడా విద్యార్థులకు నిరాశే మిగిలింది. పరీక్షల నిర్వహణపై సీఎం జగన్ వద్ద ఎలాంటి చర్చ జరగలేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ […]
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల్లో ఆయన పేరు ఖరారు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది ఎవరు? అధికార పార్టీకి చెందిన నాయకుడే ప్రత్యర్థులకు లీకులు ఇచ్చి రచ్చ చేశారా? గవర్నర్ దగ్గర ఫైల్ క్లియరైనా వైసీపీ వర్గాల్లో ఈ టాపిక్ హాట్ హాట్‌గా మారింది. ఇంతకీ అడ్డుపుల్ల వేయడానికి చూసింది ఎవరు? విభేదాల వల్లే తోటకు పదవికి రాకుండా అడ్డుకునే యత్నం! తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం వైసీపీలో విబేధాలు ఎప్పుడు గరం గరంగా ఉంటాయి. కీలక నాయకులంతా […]
‘లగాన్’… కేవలం ఆమీర్ ఖాన్ కెరీర్ కే కాదు ఇండియన్ సినిమాకే అదో పెద్ద మరుపురాని చిత్రం! ఆస్కార్ బరిలో నిలిచిన మూడు భారతీయ చిత్రాల్లో ‘లగాన్’ ఒకటి. కానీ, అది ఒక్కటి మాత్రమే ఆశుతోష్ గోవారికర్ స్పొర్ట్స్ డ్రామా స్పెషాలిటీ కాదు. బ్రిటీష్ కాలపు భారతదేశంలోకి సరికొత్త తరాన్ని తీసుకెళ్లింది ‘లగాన్’. దేశభక్తికి క్రికెట్ ని కూడా జోడించి ఎక్కడలేని ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని సాధించింది. అదే ఇరవై ఏళ్లైనా ‘లగాన్’ సినిమాని నిత్యనూతనంగా ఉంచుతోంది!ఆమీర్ ఖాన్, […]
‘సాహో’ సినిమాలో స్పెషల్ సాంగ్ తో తెలుగు వారికి దగ్గరైంది జాక్విలిన్. అయితే, హిందీలో భారీ బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకోలేకపోయినా రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ రేసులో కంటిన్యూ అవుతోంది. అయితే, ఈ 35 ఏళ్ల సీనియర్ సుందరి ముంబైలో సీరియస్ గానే సెటిల్ అవ్వాలని ఆలోచిస్తోంది. శ్రీలంక బ్యూటీ జాక్విలిన్ ముంబైలోని జుహూ ఏరియాలో ఇల్లు కొనేసింది. అంతే అయితే అది నిజంగా పెద్ద న్యూసేం కాదు. కానీ, కొత్త ఇంట్లో ఒంటిగా కాకుండా […]
బాలీవుడ్ లో రియల్ లైఫ్ రొమాంటిక్ ఎఫైర్స్ చాలా మామూలు విషయాలే. అయినా కూడా ఓ యంగ్ బ్యూటీ, మరో యంగ్ హీరోతో క్లోజ్ గా మూవ్ అయితే జనం అమాంతం అలర్ట్ అయిపోతారు. ఇక మీడియా సంగతి సరే సరి! అయితే, సోషల్ మీడియా వచ్చాక ఫ్యాన్స్ డైరెక్ట్ గానే బాలీవుడ్ ‘రూమర్డ్ కపుల్స్’ మీద కామెంట్లు చేస్తూ సరదా తీర్చుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో కియారా అద్వాణీ కూడా చిక్కింది! కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా […]
ప్రముఖ నటుడు జగపతిబాబుకు మరో సంవత్సరం గడిస్తే షష్టి పూర్తి! అయితే… తన 59 సంవత్సరాల జీవితాన్ని ఇప్పుడాయన పునశ్చరణ చేసుకోబోతున్నారు. ‘సముద్రం – ఇట్స్ మై లైఫ్’ పేరుతో జూన్ 18 సాయంత్రం 6 గంటలకు తన జీవిత విశేషాలకు సంబంధించిన కార్యక్రమం చూడొచ్చని జగపతిబాబు చెబుతున్నారు. దీనికి సంబంధించి చిన్న వీడియోను జగపతిబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రముఖ దర్శక నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్ తనయుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన జగపతిబాబు కెరీర్ […]
మాది కూడా ఒక పార్టీ అన్నట్టుగా ఉన్నారు ఆ శిబిరంలోని నాయకులు. పెద్దగా ప్రజల్లోకి వెళ్లిందీ లేదు. ఇంతలో పార్టీ అధ్యక్షుడే గోడ దూకేందుకు సిద్ధమయ్యారు. చెక్‌పోస్టు పడకుండానే లోడ్ ఎత్తేయడానికి రెడీగా ఉన్నారు. మరి.. ఆయన స్థానంలో వచ్చేవారు ఎవరు? ఆ దిశగా కసరత్తు మొదలైందా లేదా? తెలంగాణలో టీడీపీ బలంగా నిలబడే అవకాశం చిక్కలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ వెలుగు వెలిగిన పార్టీ తెలుగుదేశం. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ పరిస్థితి నానాటికీ […]
రాజకీయపార్టీలకు ఎన్నికలప్పుడు సామాజిక సమీకరణాలు గుర్తుకురావడం కామన్. ఓట్ల ఆధారంగా టిక్కెట్లు, హామీలు ఇస్తుంటాయి. అధికారపార్టీ మూడేళ్ల ముందు నుంచే అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. ఓ వర్గానికి దగ్గరవుతోంది. పదవుల్లో ప్రాధాన్యం ఇస్తోంది. ఇంతకీ అధికారపార్టీ లెక్క పక్కాయేనా..!? అనుకున్న బెనిఫిట్ దక్కుతుందా…!? మిగిలిన వర్గాల మాటేంటి..!!. కాపు, యాదవ, వెలమ, గవర, మత్స్యకారులు కీలకంవైసీపీకి పట్టుచిక్కని సిటీలోని నాలుగు స్థానాలు విశాఖజిల్లా రాజకీయాలు సామాజిక సమీకరణాలు చుట్టూ తిరగడం కొత్తేమీ కాదు. ఇక్కడ ఓటర్లు, […]
ఇటీవల ఎపి ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు ఢల్లీిలో పర్యటించి కేంద్ర పెద్దలను కలసి వచ్చాక పాలనావికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల హడావుడి బాగా పెరిగింది. హోంమంత్రిఅమిత్‌షాను కలుసుకున్నప్పుడు ఇచ్చిన మెమోరాండంలో మొదటి అంశమే పాలనావికేంద్రీకరణ కావడం యాదృచ్చికం కాదు..దీనిపై ఢల్లీిపెద్దలు ఏ రూపంలోనూ ఎలాటి అభ్యంతరంగాని భిన్నాభిప్రాయం గాని వెలిబుచ్చలేదు సరికదా ముందుకు పొమ్మని పచ్చజెండా వూపినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసుతో మొదలు పెట్టి వివిధ విభాగాలకు కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు […]