కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అనే సందిగ్థంలో పెద్ద సినిమా నిర్మాతలు మీనమేషాలు లెక్కపెడుతుంటే, చిన్న సినిమాల నిర్మాతలు మాత్రం… ఇప్పుడు కాక ఇంకెప్పుడు అన్నట్టుగా థియేటర్ల బాట పట్టారు. అలా శుక్రవారం జనం ముందుకు వచ్చిన చిత్రమే ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’. మరో విశేషమేమంటే… ఈ మూవీలోని ట్రైలర్ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ, విడుదలకు ముందే వివాదం చెలరేగింది. దాంతో జరిగిన పొరపాటును సరిదిద్దుకుని దర్శకుడు వై. […]
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపైతంపై దృష్టిసారించిన ఏఐసీసీ.. ఏపీ రాజకీయాలపై కూడా ఫోకస్ పెట్టింది. ఈ నెల 11న రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చించనున్నారు. విడివిడిగా సీనియర్ నేతలతో రాహుల్ మాట్లాడనున్నారు. ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నైరాశ్యంలో కూరుకుపోయింది. పార్టీని నడిపించే నాథుడులేక బలహీనపడిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత బలహీనమైన కాంగ్రెస్ ఇంతవరకూ కోలకోలేదు. మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ముందుకు ఎలా తీసుకెళ్లాలి? […]
2020 సంవత్సరం నుంచి చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇటు చిత్ర పరిశ్రమపై కరోనా మహమ్మారి పడగ విప్పుతూంటే… అటు ప్రముఖ నటులు పరిశ్రమకు శాశ్వతంగా దూరం అవుతున్నారు. తాజాగా మరో నటున్ని కోల్పోయింది చిత్ర పరిశ్రమ. పి.గన్నవరం మండలం రాజుల పాలెం గ్రామానికి చెందిన సినీ నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ (64) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన పలు సినిమాల్లో నటించారు. కిరాతకుడు సినిమాలో హీరోగా నటించి స్వయంగా నిర్మించారు. రూపాయి […]
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట అర్ధాంతరంగా ముగిసింది. వరుణుడు పదేపదే అడ్డుతగలడంతో ఆటకు అంతరాయం కలిగింది. చివరికి వాతావరణం అనుకూలించకపోవడంతో అంపైర్లు రెండో రోజు ఆటను నిలిపివేశారు. ఆట ఆగిపోయే సమయానికి భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే 58 పరుగులు వెనకబడి ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 21తో రెండోరోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 97 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ […]
ఏపీ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. నాడు-నేడు రెండో దశ పనులకు ఆమోదo తెలపనుంది కేబినెట్. ఏపీ మంత్రి వర్గం ఇవాళ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రులు సమావేశం కానున్నారు. ఆర్ అండ్ బి శాఖకు చెందిన 4 వేల కోట్ల ఆస్తులను ఆర్డీసీకి బదలాయించే అంశాన్ని కేబినెట్‌లో ప్రతిపాదించే అవకాశముంది. అలాగే ఏపీ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు ప్రతిపాదనలపై […]
మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 44,800 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర […]
మేషం: కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో చురుకుదనం కానవస్తుంది. లాయర్లకు పురోభివృద్ధి కానవస్తుంది. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలంగా సాగుతాయి. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో వారికి పనిభారం అధికం. నిరుద్యోగులు చిన్న సదవకాశము లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. వృషభం: వస్త్ర, బంగారం, వెండి వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలకు నూతన సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారస్తులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. బంధువుల రాకతో […]
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై మంత్రి హరీష్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. దళితుల ఓట్లను చీల్చేందుకు బిజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యాయని..హుజూరాబాద్‌లో చీకటి ఒప్పందం చేసుకున్నారన్నారు. మోడీ బొమ్మను, బిజేపీ జెండాను దాచి ప్రచారం చేస్తున్నారని.. బిజేపీకి ఓటువేస్తే పెట్రోల్ ధర రూ.200 దాటిస్తారు,ఈటల గెలిస్తే ఆయనకు మాత్రమే లాభమని మండిపడ్డారు. టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తే హుజూరాబాద్ ప్రజలకు ప్రయోజనమని.. మోడీతో కొట్లాడి ఈటల వెయ్యి కోట్ల ప్యాకేజీ తేగలడా? అని నిలదీశారు. గడియారాలు, కుక్కర్లు పంచడమే […]
ఒకరికేమో ప్రభుత్వంలోని పెద్దల అండ. ఇంకొకరికి అదే శాఖలో బడా బాబుల ఆశీస్సులు. ఇలా పెద్దోళ్లే వెనకుండటంతో ఒకే కుర్చీకోసం కుస్తీ పడుతున్నారు ఆ ఇద్దరు అధికారులు. బదిలీ అయినా వెళ్లకుండా ఒకరు.. ఛార్జ్ తీసుకోవాలని ఇంకొకరు వేయని ఎత్తులు లేవు. అదే ఆ జిల్లా వైద్యవర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. సంగారెడ్డి డీఎంహెచ్‌వో పోస్టు కోసం 4 నెలలుగా కుర్చీలాట! జిల్లాస్థాయి పోస్టులంటే రాజకీయ ప్రమేయం లేకుండా జరగవు. మనవాళ్లు అనేవాళ్లను తీసుకొచ్చి కూర్చీలో కూర్చోబెట్టుకోవడం కామన్. […]