2020 సంవత్సరం నుంచి చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇటు చిత్ర పరిశ్రమపై కరోనా మహమ్మారి పడగ విప్పుతూంటే… అటు ప్రముఖ నటులు పరిశ్రమకు శాశ్వతంగా దూరం అవుతున్నారు. తాజాగా మరో నటున్ని కోల్పోయింది చిత్ర పరిశ్రమ. పి.గన్నవరం మండలం రాజుల పాలెం గ్రామానికి చెందిన సినీ నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ (64) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన పలు సినిమాల్లో నటించారు. కిరాతకుడు సినిమాలో హీరోగా నటించి స్వయంగా నిర్మించారు. రూపాయి సినిమాకు ఆయన సహ నిర్మాతగా వ్యవహరించారు. రాజధాని, సౌర్య చక్ర, దొంగల బండి, బంగారు బుల్లోడు, రంగవల్లి తదితర సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు. ఈయన గతంలో రాజుల పాలెం గ్రామ సర్పంచ్ గా పని చేశారు. నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.