ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట అర్ధాంతరంగా ముగిసింది. వరుణుడు పదేపదే అడ్డుతగలడంతో ఆటకు అంతరాయం కలిగింది. చివరికి వాతావరణం అనుకూలించకపోవడంతో అంపైర్లు రెండో రోజు ఆటను నిలిపివేశారు. ఆట ఆగిపోయే సమయానికి భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే 58 పరుగులు వెనకబడి ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 21తో రెండోరోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 97 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన పుజారా నాలుగు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ కూడా దారుణంగా విఫలమయ్యాడు.
read also : నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. వీటిపైనే చర్చ
ఫేస్ చేసిన ఫస్ట్ బాల్‌కే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇక అజింక్య రహానే కూడా రాణించ లేకపోయాడు. 5 పరుగులు మాత్రమే చేసి రనౌట్ అయ్యాడు. ఫలితంగా 112 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ ఇబ్బందులో పడినట్టు కనిపించింది. అయితే, క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసిన రిషభ్ పంత్ నిదానంగా ఆడుతూ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. ఈ సమయంలో మేఘాలు దట్టంగా కమ్మేసి వెలుతురు మందగించడంతో ముందుగానే టీ బ్రేక్ ప్రకటించారు. ఆ తర్వాత వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. రాహుల్ 57, పంత్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.