హోరాహోరీగా సాగిన పోరులో.. ఓ పార్టీ అధినేతను ఓడించడంతో కేబినెట్‌లో బెర్త్ ఖాయమని అనుకున్నారు ఆ ఎమ్మెల్యే. కానీ.. సమీకరణాలు.. లెక్కలు అడ్డొచ్చాయి. ఇప్పుడు కేబినెట్ రెండున్నరేళ్ల ప్రక్షాళన దగ్గర పడటంతో ఈసారి పిలుపు ఖాయమని అనుకుంటున్నారట. ఎమ్మెల్యే అనుచరులు కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇంతకీ ఆశల పల్లకిలో ఉన్న ఆ ఎమ్మెల్యే ఎవరు? అప్పుడే మంత్రి పదవి వస్తుందని లెక్కలేసుకున్నారు! 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పోరు హైలెట్. జనసేన అధినేత […]
మూడేళ్ల క్రితం వరకు ఆ జిల్లాలో టీడీపీ ఓ వెలుగు వెలిగింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ కకావికలం. నాడు కీ రోల్ పోషించిన నాయకులు పత్తా లేకుండా పోయారు. అధినేత ఆదేశాలతో ఫీల్డ్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ నలుగురు పోరాటాలకు సిద్ధమయ్యారని టాక్. ఇంతకీ ఎవరా నాయకులు? స్వయంకృతాపరాధంతో హారతి కర్పూరమైన టీడీపీ ప్రతిష్ట! గుంటూరు జిల్లాను గతంలో తమ అడ్డాగా చెప్పుకొన్న టీడీపీ.. వైసీపీ గాలిలో ఆ అడ్రస్‌ను గల్లంతు చేసుకుంది. […]
హూజూరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో తెలంగాణలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెల్సిందే. ఈటల రాజేందర్ ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తుండగా ఆయన వేవ్ కొనసాగుతోంది. అయితే ఈటలను ఎలాగైనా హుజూరాబాద్లో ఓడించాలని సీఎం కేసీఆర్ పకడ్బంధీగా పావులు కదుపుతున్నారు. దీంతో ఈటెల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా పోటీ మారిపోయింది. మరోవైపు కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లురుతోంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎదుర్కొనే మొదటి […]
అఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో అక్కడి పరిస్థితులన్నీ గంటగంటకు మారిపోతున్నాయి. సెప్టెంబర్ 11న తాలిబన్లు తమ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయనుండడటంతో ప్రపంచ మొత్తం అఫ్ఘన్ వైపే చూస్తోంది. తాలిబన్లు గద్దెనెక్కక ముందే వారు వ్యవహరిస్తున్న తీరు ప్రపంచానికి పెను సవాలుగా మారుతోంది. తాలిబన్లు తమ మిత్రదేశాలుగా చైనా, పాకిస్థాన్ ను మాత్రమే ప్రకటించాయి. వీరి చర్యలు భారత్, రష్యా, అమెరికా దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ దేశాలకు చెందిన […]
రాజకీయాల్లో ఎమర్జ్ అయ్యే నేతలు కొందరు.. ప్రజలపై స్పష్టమైన ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటారు. భవిష్యత్ పై క్లియర్ అజెండాతో ముందుకు వెళ్తుంటారు. ఇప్పుడు తెలంగాణలో.. 3 ప్రధాన పార్టీల్లో.. ముగ్గురు యువనేతలు ఇలాగే రాజకీయాలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు. రాబోయే తరానికి కాబోయే రాజకీయ సారథులం మేమే అన్నట్టుగా వారు తమ తమ పార్టీల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అందులో టీఆర్ఎస్ ను గమనిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడిగా.. మంత్రిగా గుర్తింపు తెచ్చుకుని.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి […]
తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంటోంది. టీఆర్ఎస్ నేతలంతా హుజూరాబాద్ పై దృష్టి పెట్టగా.. కాంగ్రెస్, బీజేపీ నేతలు సైతం తమ తమ రాజకీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా ముందుకు పోతున్నాయి. ఈ క్రమంలో.. బీజేపీ నేతలు ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా.. పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను రాష్ట్రానికి రప్పిస్తున్నారు. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం.. ఆయన రాక ఖరారైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన […]
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ కరోనా మహమ్మారి సోకుతోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఇతరులు ఇలా చాలా మంది కరోనా బారీన పడ్డారు. అయితే.. తాజాగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. రెండు రోజులుగా అస్వస్థతకు గురైన ఆయన… ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే.. […]
సంక్షేమ పథకాల అమలుకు పెరుగుతున్న భారం.. వీటికి తోడు జీతాలు, పెన్షన్లు ఇతర కార్యక్రమాలకు భారీ స్థాయిలో వెచ్చించాల్సి రావడం.. వీటితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాస్త ఆర్థిక ఒడిదుడుకులకు లోనవుతోంది. ఈ పరిస్థితిని తట్టుకునేందుకు.. ఢిల్లీ స్థాయిలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గనతో పాటు.. ఆ శాఖ ఉన్నతాధికారులు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను సైతం బుగ్గన కలిశారు. సంక్షేమ పథకాలకు ఇస్తున్న ప్రాధాన్యం.. జనం తిరిగి డబ్బులు […]
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బండి సంజయ్ వాడిన సర్జికల్ స్ట్రైక్స్ అన్న పదం.. ఎంతటి ప్రభావాన్ని కలిగించిందో మనం ప్రత్యక్షంగా చూశాం. బీజేపీ అనూహ్య ఫలితాలను సొంతం చేసుకుని.. జీహెచ్ఎంసీలో బలం పుంజుకున్న తీరును సైతం గమనించాం. ఇదే ఒరవడిని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ముందుకు తీసుకుపోతున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా.. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఇందుకు నిదర్శనం. ఉత్తరప్రదేశ్ లో మాదిరిగా.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. వెంటనే […]
సిద్దిపేట జిల్లా : కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే తెలంగాణలో నీలి విప్లవానికి శ్రీకారమని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ లో చేప పిల్లలను విడుదల చేసి… రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రులు హరీష్ రావు ,తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని… సీఎం కేసిఆర్ ప్రత్యేక […]