కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు నగరాల్లో రహదారులు నదులను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. కొట్టాయం జిల్లాను వరదలు ముంచెత్తాయి. జిల్లాలో ఎటు చూసినా వరదే కనిపిస్తోంది. వరద ధాటికి… ఇళ్లు కూడా ధ్వంసమవుతున్నాయి. ఓ ఇల్లు కళ్ల ముందే… కూలిపోయిన దృశ్యాలు… అక్కడి వరద బీభత్సాన్ని కళ్లకు […]
మా ఎన్నికల్లో మంటలు ఇంకా చల్లారలేదు. ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణుల మధ్య వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారింది. ఎన్నికలు జరిగిన రోజు సీసీ పుటేజీ అంశం తెరపైకి వచ్చింది. పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని మంచు వర్గం చెబుతుంటే… అసలు మాకు సంబందమే లేదు. స్కూల్ యాజమాన్యం సర్వర్ రూంకి తాళం ఉందని పోలీసులు ప్రకటించారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు పూర్తయ్యాయి. నూతన అధ్యక్షుడిగా… మంచు విష్ణు, అతని ప్యానల్ సభ్యులు బాధ్యతలు కూడా స్వీకరించారు. అయినా […]
తెలంగాణలో కరోనా రోజువారి కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 26, 676 శాంపిల్స్ పరీక్షించగా… 122 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో కరోనా బాధితుడు మృతి చెందారు. ఇదే సమయంలో 176 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,68, 955 కు చేరుకోగా… రికవరీ కేసులు […]
కరోనా మహమ్మారి విజృంభించి తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్న సమయంలో ఆక్సిజన్ బ్యాంకు ద్వారా సేవలు అందించిన మెగా అభిమానులతో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. కరోనా మహమ్మారి రెండో దశ విరుచుకు పడుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో, జిల్లా స్థాయిలో ఆక్సిజన్ బ్యాంకు నెలకొల్పిన సంగతి తెలిసిందే.. ఈ ఆక్సిజన్ బ్యాంకు సేవలలో అన్ని జిల్లాల మెగా అభిమాన సంఘాల ప్రతినిధులు […]
తెలంగాణ భవన్ లో టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. అధ్యక్ష ఎన్నిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా హుజురాబాద్ ఉప ఎన్నికపై మరియు పార్టీ భవిష్యత్ కార్యచరణపై దిశా నిర్దేశం చేశారు కేసీఆర్. ప్రతి పక్షాల దిమ్మ తిరిగేలా వరంగల్ తెలంగాణ విజయ గర్జన సభతో మనపై మొరిగే కుక్కలు నక్కల నోర్లు మూయించాలని…ఈ సారి మనం ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఎన్నికలకు […]
తెలంగాణ భవన్ లో కాసేపటి క్రితమే టీఆర్‌ఎస్ పార్టీ కార్యవర్గసమావేశం ముగిసింది. ఈ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగగా.. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో కీలక వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్ని కల్లో మనమే గెలుస్తున్నామని.. ఈ నెల 27 హుజురాబాద్ లో ప్రచార సభకు తాను వస్తానని ప్రకటించారు. అలాగే… ప్రతిపక్షాల దిమ్మ తిరిగేలా వరంగల్ ప్రజా గర్జన సభ ఉండాలని… మనపై మొరిగే కుక్కలు నక్కల నోర్లు మూయించాలన్నారు. […]
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు తగ్గింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31, 712 శాంపిల్స్ పరీక్షించగా.. 432 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. మరో 05 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 586 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్‌లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2, […]
కరోనా క్రైసిస్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల్ని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి ఇరు తెలుగు రాష్ట్రాల్లో సేవలందించిన సంగతి తెలిసిందే. ఈ సేవల్లో అన్ని జిల్లాల నుంచి మెగాభిమాన సంఘాల ప్రతినిధులు పాలుపంచుకున్నారు. అందుకే ఆదివారం రోజు తెలంగాణ జిల్లాల నుంచి ఆక్సిజన్ సేవల్లో పాల్గొన్న ప్రతినిధుల్ని పిలిచి మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేదికపై అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు […]
తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు ఎంపీల సమావేశం ప్రారంభం అయింది. కాసేపటి క్రితమే… టిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పై ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది. ఈ నెల 25 న హైదరాబాద్‌లోని హైటెక్స్ లో నిర్వహించనున్న ప్లీనరీ సమావేశం పై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. అలాగే… వచ్చే నెల […]