మన దేశంలో బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన.. పసిడి ధరలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 44, 300 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 120 పెరిగి రూ. 48, 330 కి చేరింది. ఇక అటు వెండి ధరలు కూడా ఇవాళ కాస్త […]
కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ టీడీపీ జెండా తప్ప మరొకటి ఎగిరిన దాఖలాలు లేవు. వైఎస్ ఫ్యామిలీకి కడప జిల్లాలోని పులివెందుల ఎలాగో.. టీడీపీ అధినేత చంద్రబాబుకు చిత్తూరు జిల్లాలోని కుప్పం కూడా అలాగేనని అందరికీ తెల్సిందే. టీడీపీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఇక్కడ టీడీపీ హవానే కొనసాగుతూ వస్తోంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంలో పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. కుప్పంలో వైసీపీ క్రమంగా బలపడుతుండగా టీడీపీ బలహీనమవుతోంది. […]
హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే అందరి ఫోకస్ నెలకొంది. తెలంగాణతోపాటు ఏపీలోనూ హుజూరాబాద్ ఉప ఎన్నికపై వాడీవేడి చర్చ జరుగుతోంది. ప్రధాన పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుండటంతో హుజూరాబాద్ లో ఎవరు జెండా ఎగురవేస్తారా? ఆసక్తి నెలకొంది. పోలింగ్ సమయంలో దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీల ముఖ్య నేతలు రంగంలోకి దిగి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. అయితే ప్రచారం ముగింపు రోజున సీఎం కేసీఆర్ తనదైన స్టైల్లో ఓటర్లను ఆకట్టుకునేలా భారీ బహిరంగ నిర్వహించి ఫినిషింగ్ టచ్ […]
యాదాద్రికి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. రేపు యాదాద్రి పర్యటనకు వెళ్లనున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఉదయం 11.30 కు హైద్రాబాద్ నుండి బయలుదేరి వెళతారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు పూర్తి స్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నీటిని రేపటి పర్యటనలో మరోసారి సిఎం కెసిఆర్ పరిశీలిస్తారు. యాదాద్రి పున: ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామివారు నిర్ణయించి వున్నారు. ఇక రేపు యాదాద్రిలోనే ఆలయ పున: ప్రారంభం తేదీలను సిఎం కెసిఆర్ స్వయంగా ప్రకటిస్తారు. పున: […]
కాసేపటి క్రితమే…. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి చేరుకున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఈ సందర్భంగా ఆశ్రమంలోని మరకత రాజరాజేశ్వరీ దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం గణపతి సచ్చిదానంద స్వామిని కలిశారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో మంత్రులు వెల్లంపల్లి, పేర్ని నాని, కొడాలి నాని, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతి సచ్చిదానంద స్వామి మాట్లాడుతూ… నిబంధనలు అందరూ పాటిస్తే కరోనా తగ్గిపోతుందని…. ఆలయ భూములు […]
దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిత్ర మరే పార్టీకి లేదంటే అతిశయోక్తి కాదేమో. అత్యధిక కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ కొంతకాలంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ కేంద్రంలో అధికారాన్ని కోల్పోవడం ఆపార్టీపై తీవ్రంగా ప్రభావాన్ని చూపుతోంది. క్రమంగా రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పట్టుకోల్పోతుండటంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఆపార్టీకి కీలకంగా మారాయి. అయితే మోదీ-అమిత్ షా హవా ముందు కాంగ్రెస్ వ్యూహాలు పని చేయడం లేదని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం పార్టీని ఎలా […]
అనంతపురం : హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసుకున్న బాలకృష్ణ… వైద్యసేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… సరైన వైద్యం అందట్లేదని రోగుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని… జిల్లా ప్రభుత్వాస్పత్రిలోనే ఇంత అధ్వానంగా పరిస్థితులు ఉన్నాయని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ హాయంలో వ్తెద్య సేవల కోసం తెచ్చిన వ్తెద్య పరికరాలు వాడకుండా మూలన పడివేశారని మండిపడ్డారు బాలకృష్ణ. ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితులపై జిల్లా […]
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 20 నుంచి వారం రోజుల పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా సిద్ధమైంది. ప్రజా సంగ్రామ యాత్ర ఇటీవలే పూర్తి చేసుకున్న సంజయ్, ఇప్పటికే ఒకసారి హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఆయన పార్టీ సీనియర్ నేతలతో చర్చించి ప్రచార వ్యూహం రూపొందించారనీ… అందుకు అనుగుణంగా నేతలు ఈటలకు మద్దతుగా ప్రచారం మరింత ఉధృతం చేయనున్నారని పార్టీ వర్గాలు వివరించాయి. […]
ఇండియాలో మరోసారి కరోనా పాజిటివ్ రోజువారి కేసులు తగ్గాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 13, 596 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 166 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 19, 582 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.40 కోట్లకు పైగా పెరగగా.. […]
కరోనా ప్రారంభ దశలో ఉన్నప్పుడు తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా సాగేవి, ఆ తరువాత కరోనా తీవ్రత పెరగడం, లాక్‌డౌన్ విధించడంతో మద్యం విక్రయాలు సాగలేదు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా మద్యం అమ్మకాలు అంతంతమాత్రంగానే కొనసాగాయి. దసరా మాత్రం ఊపును తిరిగి తెచ్చింది.దసరా పండుగ రోజు రూ.200 కోట్ల విలువైన మద్యం అమ్ముడయ్యింది. గత ఏడాదితో పోలిస్తే ఈ దసరాకు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. కరోనా సెకండ్‌వేవ్‌తో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన రోజు […]