కరోనా ప్రారంభ దశలో ఉన్నప్పుడు తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా సాగేవి, ఆ తరువాత కరోనా తీవ్రత పెరగడం, లాక్‌డౌన్ విధించడంతో మద్యం విక్రయాలు సాగలేదు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా మద్యం అమ్మకాలు అంతంతమాత్రంగానే కొనసాగాయి. దసరా మాత్రం ఊపును తిరిగి తెచ్చింది.దసరా పండుగ రోజు రూ.200 కోట్ల విలువైన మద్యం అమ్ముడయ్యింది. గత ఏడాదితో పోలిస్తే ఈ దసరాకు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. కరోనా సెకండ్‌వేవ్‌తో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన రోజు రూ.130 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరిగాయి.
ఆ తర్వాత ఈ దసరాకే భారీగా మద్యం అమ్ముడయుంది. గత ఏడాది దసరాతో పోల్చితే ఈసారి లిక్కర్ విక్రయాల్లో 39 శాతం, బీర్లలో 57 శాతం విక్రయాలు జరిగాయి. పైగా ఈ సారి దసరా సందర్భంగా ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు కేవలం ఐదు రోజుల్లోనే రూ.685 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.. ఇక ఈ దసరాకు మాత్రం ఐదు రోజుల్లోనే 7.90 లక్షల కేసుల లిక్కర్, 8.34 లక్షల కేసుల బీరు అమ్ముడయింది. ఇ
క ఐదు రోజుల్లో కలిపి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 57 కోట్లు, హైదరాబాద్‌లో 43 కోట్ల మద్యం అమ్ముడయింది. కరీంనగర్ జిల్లాల్లో మూడు రోజుల్లోనే 29 కోట్లు, ఖమ్మంలో 27 కోట్ల మద్యం అమ్ముడైనట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది అక్టోబరులో 2 వేల 623 కోట్ల రూపాయల మద్యం విక్రయించామని, ఈసారి అది 3 వేల కోట్లకుపైగా ఉండే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు.కోవిడ్ కాలంలో బీర్ల వినియోగం చాలా వరకు పడిపోయింది. అమ్మకాలు లేకపోవడంతో తయారీ సంస్థలు బీర్ల ఉత్పత్తిని తగ్గించాయి. కూల్ డ్రింక్స్, బీర్లు తాగడంతో కోవిడ్ సోకే అవకాశాలు ఉన్నాయన్న వార్తలతో బీర్ బాటిల్స్ ని పక్కన పెట్టేశారు మద్యం ప్రియులు. కానీ సెప్టెంబర్ నుంచి బీర్ల అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. ఈ ఒక్క నెలలోనే దాదాపు 24 శాతానికి పైగా బీర్స్ అమ్ముడయ్యాయి. ఇక దసరా రోజు 2.6 లక్షల బీర్ కేసులు అమ్ముడయ్యాయి.