మన జీవితాల్లో youtube ఎంతగా భాగమయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ఓపెన్ చేయకుండా ఇప్పుడు రోజు ముగియట్లేదు. మనకు ఎలాంటి సమాచారం కావాలన్నా యూట్యూబ్ లో వెతికేస్తుంటాం.. వీడియోల ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడా యూట్యూబ్ కు 20 ఏళ్లు..! ఒక చిన్న వెబ్ సైట్ నుంచి ఇప్పుడు అతిపెద్ద వీడియో ప్లాట్ ఫాంగా మారిన యూట్యూబ్ కథేంటో ఇప్పుడు చూద్దాం...
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా చూసే కార్యక్రమాల్లో మిస్ వరల్డ్ ఒకటి. కోట్లాది మంది ఈ వేడుకలను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి వేడుకలకు ఈసారి మన హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇప్పటికే విశ్వనగరంగా పేరొందిన మన భాగ్యనగరం పేరు.. మిస్ వరల్డ్ వేడుకలతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా మార్మోగడం ఖాయం. అయితే నాణేనికి మరోకోణం ఉన్నట్టే మిస్ వరల్డ్ వేడుకలకు కూడా మరో కోణం ఉంటుంది. అనేక వివాదాలు ఈ ఈవెంట్ చుట్టూ ఉంటాయి. ఆ విషయాన్ని పక్కన […]
Deepseek AI: ఇప్పుడు ఎక్కడ చూసినా AI మాటే వినిపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది. రాబోయే కొన్నేళ్లలో AI మన భవిష్యత్తును సమూలంగా మార్చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన మార్పులు మన జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. ఇక AI పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే అంచనాలకు అందని విధంగా గణనీయమైన మార్పులు కనిపించడం ఖాయం. ఇప్పటికే చాట్ జీపీటీ, జెమిని, కోపైలట్ లాంటివి AIలో దూసుకుపోతున్నాయి. వీటన్నిటిలో చాట్ […]
వయసు పెరిగేకొద్దీ అయ్యో.. ముసలివాళ్లం అయిపోతున్నామే.. అనే ఆందోళన కలగడం సహజమే..! అందుకే తమ జీవితకాలాన్ని పెంచుకునేందుకు అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చాలా మంది ఆరోగ్యకరమైన తిండి తినేందుకు, వ్యాయామాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తద్వారా జీవితకాలాన్ని పెంచుకోవచ్చనేది ఒక నమ్మకం. అయితే ఇప్పుడు వయసుకు బ్రేక్ చెప్పేందుకు సరికొత్త మార్గాలు మనముందు ఆవిష్కారం కాబోతున్నాయి. అమృతం తాగితే మరణం ఉండదని మనం పురాణాల్లో విన్నాం. అయితే ఇప్పుడు మరణాన్ని ఆపలేకపోయినా వయసు పెరుగుదలను […]
అనుకున్నట్టే జరుగుతోంది. పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. పాలస్తీనా – ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం ఇప్పుడు ఇరాన్ వరకూ పాకింది. గల్ఫ్ దేశాలన్నీ ఏకమైతే దాని ప్రభావం అంచనా వేయడం కష్టం. మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా ఏడాదికి పైగా పోరాడుతోంది. ఇప్పుడు రష్యాకు ఉత్తర కొరియా తోడైంది.. ఇక తైవాన్ పై చైనా కాలు దువ్వుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే పలు దేశాల మధ్య పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. దీంతో మూడో ప్రపంచ యుద్ధం […]
మనలో చాలా మంది కలల ప్రపంచంలో బతికేస్తూ ఉంటారు. నిజ జీవితంలో అద్భుతాలు సాకారం కాకపోయినా కలల్లో మాత్రం ఎన్నెన్నో అద్భుతాలను ఊహించుకుంటూ బతికేస్తూ ఉంటాం. సహజంగా సినిమాల్లో మాత్రమే కలల కనడం, వాటిని సాకారం చేసుకోవడం లాంటివి చూస్తూ ఉంటాం. సైన్ ఫిక్షన్ సినిమాల్లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే కలలు కనడాన్ని పక్కన పెడితే కలల్లో కూడా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవచ్చని నిరూపించారు శాస్త్రవేత్తలు.. ఇదిప్పుడు సంచలనం కలిగిస్తోంది. ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు […]
ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నదుల్లో మూసీ ఒకటి. ఇప్పుడు దీన్ని పూర్తిగా మార్చేయాలనుకుంటోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆక్రమణలతో అన్యాక్రాంతమైపోయిన ఈ నదికి పునరుజ్జీవం కల్పించాలనుకుంటోంది. లండన్ లోని థేమ్స్ నది, సియోల్ లోని చియోంగ్ జియోన్ నది లాగా దీన్ని సుందరీకరించాలనుకుంటోంది. మరి దీనిపై వివాదం ఎందుకు..? మూసీ నది చరిత్రేంటి..? ఎందుకిలా తయారైంది..? తెలంగాణలో మూసీ నదికి ఘన చరిత్ర ఉంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ నది పేరు కూడా ఎత్తలేని […]
NTV Special Story on Cities disasters : చెన్నైలో భారీ వర్షం- ఫ్లై ఓవర్లపైకి వచ్చేసిన కార్లు.. హైదరాబాద్ లో కుండపోత- కిలోమీటర్లకొద్దీ నిలిచిపోయిన ట్రాఫిక్.. ఢిల్లీలో వాయు కాలుష్యం- వాహనాలపై నియంత్రణ.. ముంబైలో వరదలు- స్తంభించిన జనజీవనం… ఇలా నిత్యం ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం. చిన్నపాటి వర్షాలకే మన మహానగరాలు అతలాకుతలమైపోతున్నాయి.. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోంది..? లోపం ఎక్కడుంది..? అసలు ఈ మహా నగరాలకు ఏమైంది..? మెట్రో సిటీలను విశ్వనగరాలుగా […]
భారత్, కెనడాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కెనడాలో సిక్కు నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో అక్కడి భారత రాయబారి ప్రమేయం ఉందని ఆ దేశం ఆరోపించింది. ఇందుకు బలమైన ఆధారాలు సమర్పించాలని భారత్ కోరింది. ఇప్పటికే దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఇచ్చేశామంటోంది కెనడా. అసలు కెనడాకు, ఇండియాకు మధ్య గ్యాప్ ఎందుకొచ్చిందనే విషయం తెలియాలంటే చరిత్రలోకి వెళ్లాలి.. భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దిగజారిపోయాయి. కెనడా దౌత్య సిబ్బందిని భారత్ […]
ఎలాన్ మస్క్.. ప్రపంచంలో పేరొందిన వ్యాపారవేత్త. ఈయన సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం చేయడంలో ఎలాన్ మస్క్ సిద్ధహస్తుడు. తాజాగా తన అంతరిక్ష ప్రయోగాల సంస్థ స్పేస్ ఎక్స్ మరో రికార్డును సొంతం చేసుకుంది. స్టార్ షిప్ రాకెట్ బూస్టర్ పైకెగిరిన తర్వాత సేఫ్ గా లాంచ్ ప్యాడ్ చేరుకుంది. గతంలో ఎన్నోసార్లు ఈ ప్రయోగం చేసినా సక్సెస్ కాలేదు. కానీ ఈసారి మాత్రం స్పేస్ సెన్సేషన్ సృష్టించింది. ఏదైనా ఒక […]