Imran Vs Asim: ఒక్క సంతకం... కేవలం ఒకే ఒక్క సంతకం... ఒక దేశ చరిత్రను, ఒక శక్తివంతమైన నాయకుడి తలరాతను ఎలా మార్చేస్తుందో తెలుసా? 2019లో ఇమ్రాన్ ఖాన్ పెట్టిన ఆ ఒక్క సంతకం, ఇప్పుడు 2025లో ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రస్తుతం పాకిస్తాన్ లోని అడియాలా జైలు గోడల వెనుక అసలేం జరుగుతోంది?,
కేరళలో ఓ వింత జబ్బు ఆందోళన కలిగిస్తోంది. దీన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబా లేదంటే మెదడును తినే అమీబాగా పిలుస్తున్నారు. కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి ముక్కు ద్వారా మెదడులోకి వెళ్లి దాన్ని పూర్తిగా తినేస్తోంది. దీనివల్ల మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదిప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీని వ్యాప్తిని గుర్తించడం కష్టతరంగా మారింది. అసలు ఈ వ్యాధి ఎలా సోకుతుంది.. వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి.. వ్యాధి సోకితే ఏం చేయాలి.. వ్యాధి బారిన పడకుండా […]
భారత్, చైనా మధ్య ఎన్నో ఏళ్లుగా విభేదాలున్న సంగతి తెలిసిందే. చాలా అంశాల్లో ఆ దేశంతో భారత్ పోరాడుతోంది. చైనా ఎప్పటికప్పుడు భారత్‌పై కొత్త కుట్రలు చేస్తూ ఉంటుంది. తాజాగా బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ డ్యామ్ నిర్మిస్తోంది. దీన్ని భారత్‌పై వాటర్ బాంబ్ లాగా వాడుకునేందుకు చైన్ స్కెచ్ వేసిందనే ఆరోపణలున్నాయి. అయితే ఇప్పుడు చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ కూడా సిద్ధమైంది. బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ నిర్మిస్తోంది. తమ […]
కొన్ని నెలలుగా ధర్మస్థల సామూహిక ఖననాల కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వందలకొద్దీ శవాలను తాను పాతిపెట్టానంటూ ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం తవ్వకాలు జరిపింది. అయితే అతడు చెప్పినట్లు పెద్దగా ఆధారాలేమీ లభించలేదు. తాజాగా పారిశుద్ధ్య కార్మికుడు పూర్తిగా ప్లేట్ ఫిరాయించేశాడు. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం […]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50శాతం సుంకాలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అవసరమైతే మరిన్ని సుంకాలు విధించేందుకు కూడా వెనకాడబోనని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. భారత్ మాత్రం రష్యాతో బంధం కొనసాగుతుందని, టారిఫ్‌ల భారాన్ని మోసేందుకు సిద్ధమని ప్రకటించింది. అయితే ట్రంప్ ఎందుకిలా రెచ్చిపోతున్నారు? ఆయన రాజకీయ, వ్యూహాత్మక లక్ష్యాలు ఏంటి? భారత్-రష్యా సంబంధాలను దెబ్బ కొట్టేందుకే ట్రంప్ ఇలా చేస్తున్నారా..? లాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. భారత్‌పై ట్రంప్ సుంకాలు..! […]
కర్నాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల.. పశ్చిమ కనుమల్లోని ఈ ప్రాంతం మంజునాథ స్వామి ఆలయంతో ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతుంది. నిత్యం వేలాదిమంది భక్తులు ఇక్కడ స్వామి దర్శనం కోసం తరలివస్తారు. కానీ, ఈ పవిత్ర భూమి ఇప్పుడు భయంకర ఆరోపణలతో కలకలం రేపుతోంది. రెండు దశాబ్దాలుగా వందలాది మంది హత్యకు గురయ్యారని, లైంగిక వేధింపులు జరిగాయని ఓ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఫిర్యాదు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ హత్యల వెనుక ఎవరున్నారు? ఇన్నాళ్లూ ఈ రహస్యం […]
Non Veg Milk: మీరు ఎప్పుడైనా “నాన్ వెజ్ మిల్క్” అనే పేరు విన్నారా..? అసలు నాన్ వెజ్ మిల్క్ ఉంటాయా..? అని ఆశ్చర్యపోతున్నారా! కానీ, నాన్ వెజ్ పాలు ఉన్నాయ్. ఈ నాన్ వెజ్ మిల్క్ కారణంగానే అమెరికాతో భారత్ బిజినెస్ డీల్ కు బ్రేక్ పడింది. అసలు నాన్ వెజ్ మిల్క్ అంటే ఏంటి..? దీని వల్ల అమెరికాతో భారత్ డీల్ కు ఎందుకు బ్రేక్ పడింది..? మనం రోజూ టీలో, కాఫీలో, లేదా […]
Nimisha Priya: కేరళ నర్సు నిమిష ప్రియకు భారీ ఊరట లభించింది. ఆమె ఉరిశిక్షను యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఓ వైపు భారత ప్రభుత్వం, మరోవైపు కుటుంబసభ్యులు నిమిషప్రియను కాపాడేందుకు నిరంతరం శ్రమించారు. మరోవైపు కేరళకు చెందిన ఓ ముస్లిం మతపెద్ద జోక్యంతోనే నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా పడిందని సమాచారం. అయితే తానే నిమిష ప్రియను కాపాడానని కె.ఎ.పాల్ ప్రకటించుకున్నారు. మరి నిమిష ప్రియను కాపాడిందెవరు..? చివరి నిమిషంలో […]
జూలై 15 నుంచి యూట్యూబ్ తన మానిటైజేషన్ పాలసీలో కొన్ని కీలక మార్పులు చేస్తోంది. ఇప్పటివరకూ మూసపద్ధతిలో వీడియోలు చేస్తున్నవాళ్లందరూ కొత్త గైడ్ లైన్స్ వల్ల ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. మరి యూట్యూబ్ కొత్త గైడ్ లైన్స్ మీ ఛానెల్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయి? AI వీడియోల భవిష్యత్తు ఏంటి? కొత్త రూల్స్ ప్రకారం వీడియోలు ఎలా చేయాలి? లాంటి ప్రశ్నలు ఆసక్తి కలిగిస్తున్నాయి.