Allu Vs Mega War: అల్లు అర్జున్ - మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలున్నాయని చాలా రోజులుగా టాక్ నడుస్తోంది. దీన్ని అధికారికంగా ఇరు కుటుంబాలు ప్రకటించకపోయినా.. వాళ్ల మాటలను బట్టి ఇది స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్నికల ముందు మొదలైన ఈ గ్యాప్.. ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు. పైగా ఈ గ్యాప్ అన్‌వాంటెడ్‌గా వచ్చింది కాదని.. కావాలనే ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నదని తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతోంది.
సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవడికి వాడు తోపులనుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్లు వాగేయడం.. అందులో ఏదైనా ఒకటి నిజమైతే దాన్ని క్లెయిమ్ చేసుకోవడం.. దోచుకోడవం.. ఇదీ పరిస్థితి. ఇలాంటి వాళ్లకు సోషల్ మీడియాలో కొదువేలేదు. ఇలాంటి వాళ్లలో ముందుంటారు జ్యోతిష్యుడిగా చెప్పుకునే వేణు స్వామి (Venu Swamy Parankusam). వేణు స్వామి జ్యోతిష్యం ఎన్నో సార్లు ఫెయిలైంది. నేను చెప్పింది తప్పయిపోయింది.. క్షమించండి.. ఇంకెప్పుడూ జ్యోతిష్యం చెప్పను అని దండం పెట్టి వెళ్లిపోయారు. కానీ […]
ఎన్నికల సమయంలో చాలా మంది రాజకీయ నేతలు టికెట్ల కోసం పార్టీల చుట్టూ తిరుగుతుంటారు. ప్రజాసేవ చేసేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. తమకు టికెట్ ఇస్తే కచ్చితంగా గెలిచి వస్తామని పార్టీ అధినేతలకు చెప్తుంటారు. ఇప్పుడు అనకాపల్లిలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముత్యాల వెంకటేశ్వర రావు (ఎంవీఆర్) ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లూ పలు పార్టీలు ఆయన్ను రాజకీయాల్లోకి రావాలని కోరాయి. కానీ ఎంవీఆర్ అంగీకరించలేదు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి […]
రెండ్రోజులుగా బాయ్ కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. మాల్దీవులను సందర్శించడం మానేయాలని పలువురు సెలబ్రిటీలు పిలుపునిస్తున్నారు. మాల్దీవుల బదులు మన దేశంలోని అందమైన బీచ్ లను ఎంచుకోవాలని కోరుతున్నారు. మరోవైపు భారత్ నుంచి తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతుండడంతో మాల్దీవుల ప్రభుత్వం అప్రమత్తమైంది. నష్ట నివారణ చర్యలు చేపట్టింది. భారత్ తో పాటు ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం తొలగించింది. అసలు […]