జూలై 15 నుంచి యూట్యూబ్ తన మానిటైజేషన్ పాలసీలో కొన్ని కీలక మార్పులు చేస్తోంది. ఇప్పటివరకూ మూసపద్ధతిలో వీడియోలు చేస్తున్నవాళ్లందరూ కొత్త గైడ్ లైన్స్ వల్ల ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. మరి యూట్యూబ్ కొత్త గైడ్ లైన్స్ మీ ఛానెల్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయి? AI వీడియోల భవిష్యత్తు ఏంటి? కొత్త రూల్స్ ప్రకారం వీడియోలు ఎలా చేయాలి? లాంటి ప్రశ్నలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
READ MORE: Ronith Roy : తిండిలేక ఇబ్బందులు పడ్డా.. ప్రముఖ నటుడు కామెంట్స్
జూలై 15 నుంచి యూట్యూబ్ తన పార్ట్‌నర్ ప్రోగ్రామ్ నిబంధనలను అప్‌డేట్ చేస్తోంది. ప్రధానంగా “మాస్-ప్రొడ్యూస్డ్”, “రిపీటిటివ్”, “ఇన్‌ఆథెంటిక్” కంటెంట్‌కు మానిటైజేషన్ నిలిపేస్తోంది. గతంలో “రిపీటిటివ్ కంటెంట్” అని పిలిచే పాలసీని ఇప్పుడు “ఇన్‌ఆథెంటిక్ కంటెంట్”గా మార్చారు. యూట్యూబ్ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఇకపై మాస్-ప్రొడ్యూస్డ్ కంటెంట్ కు మానిటైజేషన్ ఉండదు. అంటే.. ఒకే టెంప్లేట్‌ను ఉపయోగించి వీడియోలు చేయడం, లేదంటే చిన్నచిన్న మార్పులతో వందల కొద్దీ వీడియోలు సృష్టించడం లాంటివాటికి ఇకపై డబ్బు రాదు. కేవలం టైటిల్స్, థంబ్ నైల్స్ మార్చి సేమ్ కంటెంట్ ని అప్ లోడ్ చేస్తే వేస్ట్ అన్నమాట. ఇక రెండోది రిపీటిటివ్ కంటెంట్. ఒకే వీడియోను మళ్ళీ మళ్ళీ అప్‌లోడ్ చేయడం లేదా చిన్నచిన్న మార్పులు చేసి పోస్ట్ చేయడం లాంటివి కూడా ఇకపై కుదరదు. కొంతమంది వీడియోలను క్రాప్ చేస్తుంటారు. లేదంటే వీడియో స్పీడ్ ని పెంచడమో, తగ్గించడమో చేస్తుంటారు. ఇలాంటి వాటికి కూడా ఇకపై డబ్బు రాదు. ఇక మూడోది- ఇన్‌ఆథెంటిక్ కంటెంట్. అసలు ఎలాంటి వాల్యూ లేకుండా కేవలం వ్యూస్ కోసం కొంతమంది వీడియోలను సృష్టిస్తుంటారు. ఇకపై అలాంటివి కుదరవు. ఒరిజినాలిటీకి, ప్రామాణికతకు ప్రాధాన్యత ఇవ్వబోతోంది.
READ MORE: Post Office RD Scheme: పోస్ట్ ఆఫీస్ అద్భుత పథకం.. 5 ఏళ్లలో రూ. 35 లక్షలు..
యూట్యూబ్ తీసుకొస్తున్న కొత్త గైడ్ లైన్స్ పై చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ గైడ్ లైన్స్ వల్ల చాలామంది క్రియేటర్లు నష్టపోయే అవకాశం ఉంది. ఎలాంటి క్రియేటర్లు నష్టపోయే అవకాశం ఉంది? యూట్యూబ్ కొత్త గైడ్ లైన్స్ వల్ల ప్రధానంగా నష్టపోయేది – రీ-అప్‌లోడర్స్: కొంతమంది క్రియేటర్లు ఇతరుల వీడియోలను లేదా తమ పాత వీడియోలను ఎటువంటి వాల్యూ యాడ్ చేయకుండా మళ్లీ మళ్లీ అప్ లోడ్ చేస్తుంటారు. అలాంటి వాళ్లకు ఇది బ్యాడ్ న్యూస్. మరికొంతమంది లో-ఎఫర్ట్ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు. వీళ్లు చిన్నచిన్న మార్పులతో ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుండా కేవలం వ్యూస్ కోసం మాత్రమే వీడియోలు పబ్లిష్ చేస్తుంటారు. స్టాక్ ఫుటేజీలు వాడడం, కాపీరైట్ ఫ్రీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో స్లైడ్ షోలు వేయడం లాంటివన్నమాట. అలాగే రియాక్షన్ వీడియోలు కూడా. వేరే వాళ్ల వీడియోలను ప్లే చేస్తూ కేవలం ఎక్స్‌ప్రెషన్స్ తో వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ఇలాంటి వీడియోలకు ఇకపై మానిటైజేషన్ రాదు. మరికొంతమంది క్రియేటర్లు టెంప్లేట్-బేస్డ్ వీడియోలు చేస్తుంటారు. ఒకే టెంప్లేట్‌ను ఉపయోగించి, కంటెంట్‌లో ఎలాంటి మార్పు లేకుండా వీడియోలు చేసేస్తుంటారు. ఇలాంటి వాళ్లందరికీ యూట్యూబ్ చెక్ పెట్టబోతోంది. ఇటీవల ఏఐ కంటెంట్ కూడా యూట్యూబ్ లో బాగా పెరిగిపోయింది. AIతో వీడియోలను జనరేట్ చేసేసి పోస్ట్ చేసేస్తున్నారు. స్క్రిప్టింగ్, ఎడిటింగ్, వాయిస్ ఓవర్.. ఇలా అన్నింటినీ ఏఐ చేసేస్తోంది. ఇలాంటి వీడియోలలో మానవ ప్రమేయం ఏమాత్రం ఉండదు. ఎలాంటి వాల్యూ జోడించరు. ఇలాంటి AI వీడియోలకు కూడా యూట్యూబ్ ఇకపై డబ్బులివ్వదు. ఇక చివరగా కాపీరైట్ ఉల్లంఘించేవాళ్లు. ఎలాంటి అనుమతి లేకుండా ఇతరుల వీడియోలను ఎత్తేసి వాడుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్లందరికీ ఇకపై గడ్డురోజులే అని చెప్పొచ్చు.
READ MORE: Air India crash: 7 ఏళ్ల క్రితమే ‘‘ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్’’ సమస్యని గుర్తించిన యూఎస్ సంస్థ..
మరి కొత్త గైడ్ లైన్స్ ప్రకారం వీడియోలు చేయాలంటే ఏం చేయాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అన్నిటికంటే ముందుగా ఒరిజినాలిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి. మీ కంటెంట్ ప్రత్యేకంగా ఉండాలి. ఒరిజినల్‌దై ఉండాలి. ఒకవేళ ఇప్పటికే ఉన్న కంటెంట్ ను వాడుకోవాల్సి వస్తే దానికి మీ వాయిస్ ఓవర్ యాడ్ చేయాలి. లేదంటే విశ్లేషించాలి. ఆసక్తికరంగా ఎడిటింగ్ చేయాలి. మీరు చేసే ప్రతి వీడియో విలువైనదై ఉండాలి. ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలి లేదంటే వారికి ఏదైనా నేర్పించాలి. కేవలం వ్యూస్ కోసం కాకుండా, మీ కంటెంట్ వారికి ఉపయోగపడేలా ఉండాలి. అన్నిటికీ మించి నాణ్యమైన వీడియోలు చేయాలి. వీడియో, ఆడియో క్వాలిటీ బాగుండాలి. ఎడిటింగ్ మెరుగుపరచుకోవాలి. ఇది మీ కంటెంట్‌కు వాల్యూ యాడ్ చేస్తుంది. మీ ప్రతి వీడియో ప్రేక్షకులను చివరివరకూ ఎంగేజ్ చేసేలా ఉండాలి. మంచి స్క్రిప్ట్, ఆసక్తికరమైన ప్రెజెంటేషన్ ఇందుకు సహాయపడతాయి. యూట్యూబ్ లో ఏం చేసినా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ మర్చిపోకూడదు. కచ్చితంగా వాటిని పాటించాలి. యూట్యూబ్ పాలసీలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటూ మన వీడియోలను కూడా ఆ మేరకు అప్‌డేట్ చేసుకుంటూ వెళ్లాలి. అప్పుడే యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదించవచ్చు.
READ MORE: KA Paul: నా కొడుకు అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి.. కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
కొత్త గైడ్ లైన్స్ చూసి చాలా మంది AI క్రియేటర్లు భయపడిపోతున్నారు. ఇక తమ పనైపోయిందని ఆందోళన చెందుతున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. AI ద్వారా వీడియోలు తయారు చేసే వాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. యూట్యూబ్ AI వీడియోలను పూర్తిగా నిషేధించడం లేదని గుర్తుంచుకోవాలి. అయితే AIని సక్రమంగా వినియోగించాలని మాత్రం చెప్తోంది. ప్రతి పనినీ AIకి వదిలిపెట్టేసి బద్దకించవద్దని హెచ్చరిస్తోంది. AI వీడియోలు మానిటైజ్ కావాలంటే.. వీడియోలకు మనదైన స్టైల్ జోడించాలి. AI తయారు చేసిచ్చిన కంటెంట్ కు మన వాయిస్ ఓవర్ యాడ్ చేయాలి, లేదంటే సందర్భానుసారం ఎడిటింగ్ చేయాలి. మ్యూజిక్ యాడ్ చేయాలి.. ఉదాహరణకు AI వాయిస్‌తో ఒక బ్లాగ్ పోస్ట్ ను చదివి, స్టాక్ ఫుటేజ్‌లతో ఓ వీడియో క్రియేట్ చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తే అలాంటివి మానిటైజ్ కావు. అయితే అదే కంటెంట్ ను AI వాయిస్‌ను ఉపయోగించి, మీరు స్వయంగా సృష్టించిన విజువల్స్ ను యాడ్ చేస్తే మానిటైజ్ అవుతాయి. అలాగే AI జనరేటెడ్ వీడియోలకు మీ స్వంత విశ్లేషణను జోడించవచ్చు. అంతేకాక, మీ వీడియోలో AIని ఉపయోగించినట్లయితే, అది స్పష్టంగా తెలియజేయాలి. ముఖ్యంగా, వ్యక్తులు లేదా సంఘటనలను పోలి ఉండే కంటెంట్ అయితే, తప్పనిసరిగా డిస్‌క్లోజ్ చేయాలి. చివరగా AIతో మాస్-ప్రొడక్షన్ చేయొద్దు. AIని ఉపయోగించి పెద్ద సంఖ్యలో ఒకే రకమైన, నాణ్యత లేని వీడియోలను సృష్టించవద్దు. వీటివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.
READ MORE: KA Paul: నా కొడుకు అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి.. కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
యూట్యూబ్ కొత్త గైడ్‌లైన్స్ క్రియేటర్ల ఒరిజినాలిటీకి, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. AI అనేది ఒక శక్తివంతమైన సాధనం. కానీ దానిని బాధ్యతాయుతంగా, మీ సృజనాత్మకతకు తోడుగా ఉపయోగించుకోవాలని సూచిస్తున్నాయి. ఈ మార్పులను అర్థం చేసుకుని, మీ కంటెంట్ స్ట్రాటజీని దానికి అనుగుణంగా మార్చుకుంటే, మీరు యూట్యూబ్‌లో విజయవంతంగా కొనసాగవచ్చు.