JP Nadda: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి రాక ముందు అవినీతి, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడిచేది అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా తెలిపారు. వైసీపీ అసమర్థత, అస్తవ్యస్తమైన ప్రభుత్వాన్ని కూలదోసి కూటమిని ఎంచుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఆయన తెలిపారు.
Speaker Ayanna Patrudu: నా బాధను మనసు విప్పి చెబుతున్నాను.. కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా జీతం తీసుకుంటున్నారు అని శాసన సభా స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత మాజీమంత్రి రోజాకు లేదు అని మంత్రి దుర్గేష్ తెలిపారు. పర్యాటక మంత్రిగా రోజా గతంలో రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. ఇక, పవన్ కళ్యాణ్ సినిమా నటుడుగానే విమానాల్లోనే తిరిగారు.. ఇప్పుడు మంత్రిగా విమానాల్లో తిరిగితే తప్పేంటి అని ప్రశ్నించారు.
సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలోని భారత జట్టుపై షోయబ్ అక్తర్ ప్రశంసలు గుప్పించాడు. టీ20ల్లో ఈ జట్టు అద్భుతంగా ఆడుతుందన్నారు. అలాగే, ఈ జట్టుతో అప్రమత్తంగా ఉండాలని పాక్ కూ సూచించాడు. వారు మీపై ఆధిపత్యం చెలాయిస్తారని క్లియర్ గా తెలుస్తోంది.