Minister Satya Kumar: ఆంధ్రప్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, అభివృద్ధిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దివాళా తీసిన ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా స్వీకరించి దేశానికి విశ్వగురువుగా మార్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక, ప్రజల మనోభావాలకు అనుగుణంగా డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో అద్భుతంగా పని చేస్తోందని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్ల విధ్వంసకరమైన పాలన నుంచి రాష్ట్రాన్ని బయటకు తీయడమే కాకుండా, అభివృద్ధి- సంక్షేమాన్ని సమాంతరంగా అమలు చేస్తున్నామని సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
Read Also: OG : ‘ఓజీ’ నుంచి మరో సాంగ్ పై మేకర్స్ పోస్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న పోస్టర్
అలాగే, రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉన్న ఉచిత బస్సు సౌకర్యం వల్లే ఉదయం “మెరుపు కలలు” సినిమా వైజాగ్‌లో, మధ్యాహ్నం అనకాపల్లిలో “మేఘ సందేశం”, సాయంత్రం రాజమండ్రిలో “కార్తీక దీపం” సీరియల్ చూసి తిరిగి ఇంటికి చేరుకునే అవకాశం కలుగుతోందని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు. దివాళా స్థాయి నుంచి అభివృద్ధి పథంలో ముందుకు కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశానికి రోల్ మోడల్‌గా మారిందన్నారు. ఇకపై భౌగోళికంగా, రాజకీయంగా, సంస్థాగతంగా రాష్ట్రంలో బీజేపీని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.