భారత స్టార్ బ్యాటర్, రన్మెషీన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డ్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానానికి కోహ్లీ ఎగబాకాడు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఆయన మండిపడ్డారు. మాకు కుల, మతల ఫీలింగ్స్ లేవు అని పేర్కొన్నారు. ఈ బాబ్రీ మసీదు కూల్చింది కాంగ్రెస్ పార్టీ హయాంలో కాదా.. ధర్మపురి అర్వింద్ తో చేతులు కలిపి ఎమ్మెల్సీ కవితమ్మను ఓడించలేదా అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ టెస్టులు ఆపాలని ఎస్పీలు, కమిషనర్లకు TSLPRB ఆదేశాలు ఇచ్చింది
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో తెలంగాణ బీజేపీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సునీల్ బన్సల్, ప్రకాష్ జవదేకర్ పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ ఎన్నికల రూట్ మ్యాప్ పై ప్రధానంగా చర్చ జరిగింది. అభ్యర్థుల ఖరారు, అగ్రనేతల నేతల ప్రచారం, మేనిఫెస్టో అంశాలపై చర్చ కొనసాగింది.
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మీద ప్రజలకు విసుగు ఉంది అని ఆయన అన్నారు. అపుడు కాంగ్రెస్ పాలనలో చేసిన పాపాలను ప్రజలు మరచిపోవడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్రలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్లో రేపు సాయంత్రం జరగాల్సిన పాదయత్ర క్యాన్సిల్ అయింది. రేపు ఆర్మూరులో పసుపు, చెరుకు రైతులతో ముఖాముఖీ సమావేశం అవుతారు.
28 వేల కోట్ల రూపాయలతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాలేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్ చేసి లక్ష 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి అదనంగా చుక్క నీరు ఇవ్వకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి అని ఆయన అన్నారు.
ఇబ్రహీంపట్నం డబుల్ మర్డర్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2022 మార్చ్ ఒకటో తేదీన శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలనే రియల్టర్లపై కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు శిక్షను రంగారెడ్డి జిల్లా కోర్టు విధించింది.
కేసీఆర్ ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం రాబోతుంది.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి కాంగ్రెస్ ను ఓడించాలని చూస్తున్నాయి.. బీజేపీ, ఎంఐఎంకు ఓటు వేస్తే అవి బీఆర్ఎస్ కు వేసినట్టే.. బీజేపీపై పోరాడినందుకు నాపై కేసులు పెట్టారు.. నా లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారు అంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలకు టీపీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ సన్నాసి.. తెలంగాణకి.. కాంగ్రెస్ కి ఏం సంబంధం ఉందని అంటున్నాడు.. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే.. మీరు బిచ్చం ఎత్తుకు బతికే వాళ్ళు అంటూ ఆయన మండిపడ్డారు.