ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకలీ ఓట్లను తొలగించాలని వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో మంత్రులు సమావేశం అయ్యారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఓట్ల జాబితాలో అవకతవకలపై కంప్లైంట్ చేశారు. ఎన్నికల ప్రధానాధికారికి మంత్రులు దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణులతో పాటు మాజీ మంత్రి కన్నబాబు వినతి పత్రం ఇచ్చారు.
Read Also: France: ఫ్రాన్స్‌లో దాడుల కలకలం.. 6 ఎయిర్‌పోర్టుల్లో ఎమర్జెన్సీ..
ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. 2014 నుంచి చంద్రబాబు ప్రణాళిక బద్దంగా సుమారు 60 లక్షల దొంగ ఓట్లు చేర్చారు అని ఆయన ఆరోపించారు. విచారణ జరిపి దొంగ ఓట్లను తొలగించాలని విఙప్తి చేశాం.. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి పరిస్థితులు మంచివి కావు అన్నారు. ఇక, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఓట్ల జాబితా లో ఉన్న అవకతవకలపై సీఈఓను కలిశామన్నారు. ప్రతిపక్షం పాలనలో ఉండగా రాష్ట్రంలో అనేక దొంగ ఓట్లు జాయిన్ చేశారు.. ఎన్నికలు ఫెయిర్ గా జరగాలి అంటే జాబితా సరిచేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు తప్పు చేసి జైల్లో ఉంటే హైదరాబాద్, అమెరికా లో ఉద్యమాలు చేస్తున్నారు అంటూ మంత్రి చెల్లబోయిన వేణు మండిపడ్డారు. హైదరాబాద్ లో ఉండే వారిలో కొందరికి అక్కడా, ఇక్కడా ఓట్లు ఉన్నాయి.. వాటిని గుర్తించి ఓక చోట ఓటు ఉంచి మరో చోట తొలగించాలన్నారు.
Read Also: Actor Naresh: పవన్ పేరు లాగుతూ పొలిటికల్ ఎంట్రీపై నరేశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇక, ఓట్ల జాబితాలో ఉన్న అక్రమాలపై విచారణ చేయాలని సీఈఓను కోరామని మాజీమంత్రి కురసాల కన్నబాబు అన్నారు. 27 వ తేదీన ముసాయిదా జాబితా సిద్ధం అవుతుందని చెప్పారు.. అప్పటి వరకు ఓట్ల నమోదు, తొలగింపుపై ఫ్రీజింగ్ ఉందని చెప్పారు.. వైసీపీ పార్టీ తరుపున ఓట్ల జాబితా లోని అక్రమాలను గుర్తించి ఫిర్యాదు చేశాం.. ఒకే వ్యక్తికి నాలుగైదు నియోజకవర్గాలలో ఓట్లు కలిగి ఉన్నట్లు గుర్తించి ఫిర్యాదు చేశాం.. చనిపోయిన వ్యక్తుల ఓట్లు జాబితా నుండి తొలగించాలి అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు.