Dussehra 2025: దసరా పండగను విజయదశమి అని కూడా పిలుస్తుంటారు. ఈ పండగకు హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం 10వ రోజున దసరా పండుగ వస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీన్ని జరుపుకుంటారు.
Karumuri Nageswara Rao: జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవిని, సినిమా వాళ్ళని ఎంత గౌరవించి పంపారో ఆయన లేఖ ద్వారా బయట పడింది అని వైసీపీ నేత, మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. అసెంబ్లీలో చిరంజీవి మీద నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ నాగబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించకపోవడం శోచనీయం అన్నారు.
Womens Protest: గుంటూరు ఎస్పీ కార్యాలయం ముందు మహిళల ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అనుచరులు తమపై దాడి చేసి ఇబ్బంది పెట్టారంటూ కోటేశ్వరమ్మ అనే మహిళ ఆమె కూతురుతో కలిసి ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. తమపై దాడి జరిగిందని మేడికొండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే, సీఐ దురుసుగా వ్యవహరిస్తున్నారు అని బాధిత మహిళలు పేర్కొంటున్నారు.
Cyclone Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య దిశగా పయనించి రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ నెల 3వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడే ఛాన్స్. ఉత్తర కోస్తా- దక్షిణ ఒడిస్సా మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటనుంది.
Minor Rape Case: చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఈ నెల 25వ తేదీన చిత్తూరులోని నగరవనం పార్కుకు వెళ్లిన ప్రేమ జంటను ముగ్గురు దుండగులు అడ్డుకున్నారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎంపీ బుట్టా రేణుక పదవికి మళ్లీ ఎర్త్ పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోకల్‌గా బుట్టా, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి వర్గాల మధ్య గొడవలు పీక్స్‌కి చేరాయట.
ఏపీలో ఇప్పుడు ఒకటే టాపిక్ ట్రెండింగ్‌లో ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో చిరంజీవి టార్గెట్‌గా బాలకృష్ణ చేసిన కామెంట్స్‌పై మెగా అభిమానులతో పాటు సగటు వైసీపీ కార్యకర్త కూడా ఫైర్ అవుతున్నారు. ఇదే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ అయ్యిందట.