డీప్ ఫేక్ వీడియోలపై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తప్పుడు సమాచారంతో వాటిని ఎదుర్కోవడానికి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పలు సూచనలు చేశారు. ముఖ్యమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు సలహాలు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ రాజ్యసభకు తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వ నియమాలు-నిబంధనలు, వినియోగదారు ఒప్పందాలలో తగిన నిబంధనలు ఉన్నాయని నిర్ధారించుకోవాలని కేంద్రమంత్రి సలహా ఇచ్చారు. ఐటి నిబంధనల ప్రకారం నిషేధించబడిన ఏదైనా సమాచారాన్ని వినియోగదారులు హోస్ట్ చేయడం, ప్రదర్శించడం, అప్‌లోడ్ చేయడం, సవరించడం, ప్రచురించడం, ప్రసారం చేయడం, నిల్వ చేయడం, అప్‌డేట్ చేయడం లేదా షేర్ చేయడం వంటివి చేయకూడదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు.
Read Also: Rajasthan: ప్రభుత్వమే ఏర్పాటు కాలేదు.. అప్పుడే యాక్షన్ మూడ్ లో బీజేపీ
ఇక, భారతదేశంలో ఇంటర్నెట్ సురక్షితమైనది, విశ్వసనీయమైనది అని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. వినియోగదారులందరికీ జవాబుదారీగా ఉండేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యం అని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 66డి కింద కంప్యూటర్ వనరులను ఉపయోగించి మోసానికి పాల్పడితే మూడేళ్ల వరకు జైలుశిక్షతో పాటు 1 లక్ష రూపాయల వరకు జరిమానా విధించవచ్చని రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభలో తెలియజేశారు.