Gold Rate Today: బంగారం ధరలు రోజు రోజుకు క్రమంగా పెరుగుతూ తగ్గేదెలే అంటున్నాయి. ఇక, ఇవాళ కూడా పసిడి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఈరోజు తులం గోల్డ్ ధర రూ. 220 పెరిగింది. కిలో వెండి ధర రూ.1000 పెరిగింది. తులం పుత్తడి ధర రూ. లక్షా 30 వేల వైపు పరుగులు తీస్తోంది. కాగా హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం (10 గ్రాముల) ధర రూ. 220 పెరిగి లక్షా, 24 వేల 150గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాముల) రూ. 200 ఎగబాకి లక్షా 13 వేల వద్ద ట్రేడ్ అవుతోంది.
Read Also: StoryBoard: అధికారం ఉన్నా.. లేకున్నా కాంగ్రెస్ అంతేనా..?
మరోవైపు, వెండి ధరలు సైతం భగభగమంటున్నాయి. ఈరోజు కిలీ వెండి 1000 రూపాయలు పెరగడంతో ఏకంగా లక్షా 70 వేలకు చేరింది. కేవలం 6 రోజుల్లో అటు బంగారం 5,620 రూపాయలకు పెరగగా, వెండి మాత్రం 9 వేల రూపాయలకు పెరగటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.