సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు అణ్వాయుధాలను ప్రయోగించడానికి తాము వెనకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ తో కొనసాగుతున్న వార్ అణుయుద్ధాలకు దారి తీస్తుందా? అన్న ప్రశ్నకు ఆయన ఈ మేరకు ఆన్సర్ ఇచ్చారు.
ఉత్తరాఖాండ్ రాష్ట్రం నైనిటాల్ జిల్లాలోని ఓఖల్కండ బ్లాక్‌లో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో హల్ద్వానీ నుంచి ఓఖల్కండ బ్లాక్‌లోని పూదపురి గ్రామానికి వెళ్తున్న మ్యాక్స్ వాహనం పాట్లోట్ సమీపంలో 200 అడుగుల లోతులో పడిపోయింది.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తన నివాస ఆవరణలో మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి అని కోరారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ రాజకీయ లబ్ధి కొరకు మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నించింది.. ముస్లింలను బూచిగా చూపి హిందూ ఓట్లలను మభ్యమెట్టి రాజకీయాలు చేశారు.
బీజేపీ గెలిచిన 8 చోట్ల బీఆర్ఎస్ పార్టీ 7 చోట్ల డిపాజిట్ కోల్పోయిందని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. ఏడు చోట్ల బీజేపీని గెలిపీయించింది బీఆర్ఎస్.. వారి ఆత్మబలిదానాలు చేసి అవయవ దానం చేసింది బీజేపీకి.. నేను ఎన్నికలో ఇదే ఆరోపణ చేస్తే బీఆర్ఎస్ నాతో వితండవాదం చేసింది.
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి చిలుకనగర్ లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అయితే, కొడుకు శివ శంకర్ తల్లి రమాదేవి ఆస్తిని బలవంతంగా తన పేరుపై రాయించుకుని ఇంటి నుంచి బయటకు గెంటి వేయడంతో ఆమె ఇంటి ముందు నిరసనకు దిగింది.
Ntvతో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరి బోర్డు మెంబర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఇవాళ ఢిల్లీలో ఎన్డీయే కీలక సమావేశం జరుగుతుంది.. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరగనుంది.. ప్రధానిగా మోడీ అభ్యర్థిత్వంలో ఎలాంటి అనుమానాలు లేవు అని చెప్పుకొచ్చారు.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అల్మాస్‌గూడలోని వినాయక హిల్స్ లో కూతురు నిహారిక అత్తను తండ్రి చంపేశాడు.
ఇండియా కూటమిలో సహచరులుగా, బీహార్ లో కొన్ని రోజుల పాటు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నడిపిన నితీశ్ కుమార్, తేజస్వీలు ఒకే విమానంలో ప్రయాణించబోతున్నారు. దీంతో నితీశ్, తేజస్వీల మధ్య చర్చ జరిగే ఛాన్స్ లేకపోలేదని ఊహగానాలు వినిపిస్తున్నాయి.