India: రష్యాలో ఉద్యోగాల పేరిట మోసపోయి బలవంతంగా ఆర్మీలో పని చేస్తున్న సుమారు 25 మంది భారతీయులకు విముక్తి దొరకనుంది. వారందరినీ రిలీజ్ చేయాలని రష్యా సర్కార్ నిర్ణయించింది.
K Annamalai: తమిళనాడు రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ కె ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై డిమాండ్ చేశారు. విచారణ చేసేందుకు కేంద్ర ఏజెన్సీకి ఎందుకు అప్పగించడానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సిద్ధంగా లేరని ప్రశ్నించారు.
Mumbai rain: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ముంబైలోని వీధులు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో.. ఇప్పటికే 50 విమానాలు రద్దు కాగా, పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లను సైతం రద్దు చేశారు
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేటి (మంగళవారం) ఉదయం 9.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భూమా అతిథి గృహానికి చేరుకోనున్నారు.
మాస్కో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్య ఇవాళ (మంగళవారం) విస్తృత చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రతినిధి స్థాయి చర్చలు కూడా ఉంటాయిని అధికారులు చెప్పారు.
India-France: భారత్ త్వరలో 26 మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది. హిందూ మహా సముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనా ముప్పు పెరుగుతున్న తరుణంలో ఫ్రాన్స్ తో భారత్ ఈ ఒప్పందం చేసుకుంది. 26 రాఫెల్ సముద్ర యుద్ధ విమానాలపై భారతదేశం, ఫ్రాన్స్ మధ్య రెండవ రౌండ్ చర్చలు సోమవారం నుంచి దాదాపు 10- 12 రోజుల పాటు ఈ చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది.
Sandeshkhali Case: పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కతా హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బెంగాల్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
Mumbai Hit-And-Run: మహారాష్ట్రలో జరిగిన బీఎండబ్ల్యూ కారు ప్రమాదం కేసులో నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ప్రమాదానికి కారణమైన మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాకు చెందిన శివసేన (షిండే) వర్గానికి చెందిన లీడర్ రాజేష్ షా కుమారుడు మిహిర్ షా కోసం గాలిస్తున్నారు.
Jharkhand Floor Test: జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన తర్వాత హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇవాళ (సోమవారం) విజయం సాధించింది.