India-France: భారత్ త్వరలో 26 మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది. హిందూ మహా సముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనా ముప్పు పెరుగుతున్న తరుణంలో ఫ్రాన్స్ తో భారత్ ఈ ఒప్పందం చేసుకుంది. 26 రాఫెల్ సముద్ర యుద్ధ విమానాలపై భారతదేశం, ఫ్రాన్స్ మధ్య రెండవ రౌండ్ చర్చలు సోమవారం నుంచి దాదాపు 10- 12 రోజుల పాటు ఈ చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్‌తో ఇండియన్ గవర్నమెంట్ గట్టి బేరసారాలు కొనసాగిస్తుంది. దాదాపు 50 వేల కోట్ల రూపాయలకు పైగా డీల్ కోసం ఫ్రెంచ్ ప్రభుత్వ అధికారులతో చర్చలు కొనసాగిస్తుంది. ఇందులో చాలా వరకు విమానాల ధరకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ డీల్ కోసం ఫ్రాన్స్ రూ. 50 వేల కోట్లకు పైగా డిమాండ్ చేస్తుండగా.. భారత్ మాత్రం ఈ డీల్‌లో ఆయుధాలతోనే విమానాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది.. ఒక్కో విమానంలో అనేక రకాల క్షిపణులను అమర్చనున్నారు.. అలాగే, వీటిలో భారత్‌కు చెందిన ఎయిర్ టు ఎయిర్ క్షిపణి ఆయుధాలు కూడా ఉండనున్నాయి.
Read Also: Tuesday Stotras: ఆషాఢమాసం, మంగళవారం నాడు ఈ స్తోత్రాలు వింటే సమస్త పాపాలు హరించిపోతాయి
అయితే, రాఫెల్ మెరైన్ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సామర్థ్యాన్ని నేవీ విమాన వాహక నౌకలో పరీక్షించారు. ఈ ప్రక్రియలను మెరుగుపరచడానికి, కొన్ని ప్రత్యేక పరికరాలు కూడా విమానాలలో రూపొందించారు. నిర్మాణ సామగ్రి పెరిగిన ద్రవ్యోల్బణం తాజా ఒప్పందంలో కూడా తీవ్ర ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. ఇదే కాకుండా, రెండు- ఇంజిన్ల ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ గతంలో వైమానిక దళం కోసం కొనుగోలు చేసిన విమానం కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.. అయితే, కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌కు ప్రాథమిక ధర మునుపటి విమానాల మాదిరిగానే నిర్ణయించారు. కొత్త విమానం భారతదేశానికి చెందిన రెండు విమాన వాహక యుద్ధ నౌకలలో అమర్చబడే అవకాశం ఉంది.