Mumbai Hit-And-Run: ముంబైలో హిట్ అండ్ రన్ కేసు.. శివసేన (షిండే) నాయకుడు కొడుకు కోసం గాలింపు..!
- ముంబైలో సంచలనం రేపుతున్న హిట్ అండ్ రన్ కేసు..
- షిండే వర్గం నేత రాజేశ్ షా కుమారుడి కోసం పోలీసుల గాలింపు..
- రాజేశ్ షా.. డ్రైవర్లను కోర్టులో ప్రవేశ పెట్టిన ముంబై పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Hit-And-Run: మహారాష్ట్రలో జరిగిన బీఎండబ్ల్యూ కారు ప్రమాదం కేసులో నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ప్రమాదానికి కారణమైన మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాకు చెందిన శివసేన (షిండే) వర్గానికి చెందిన లీడర్ రాజేష్ షా కుమారుడు మిహిర్ షా కోసం గాలిస్తున్నారు. అయితే, ప్రమాదం జరిగే సమయంలో మిహిర్ షానే కారుని నడిపినట్లు తేలింది. యాక్సిడెంట్ చేసిన తర్వాత నిందితుడు పరార్ కావడంతో.. అతడి కోసం ఆరు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఘటన జరిగిన టైంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇప్పటికే, మిహిర్ షాపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడంతో పాటు అతడి ఇంటికి తాళం వేసి ఉందని పోలీసులు చెప్పుకొచ్చారు. నిందితుడి తల్లి, సోదరి ఆచూకీ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
Read Also: Dark Chocolate Benefits: మీరు ఆర్యోగ్యంగా ఉండాలనుకుంటున్నారా?.. అయితే ఈ చాక్లెట్ తినాల్సిందే!
Also Read
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
అయితే, నిందితుడి తండ్రి రాజేష్ షా, అతని డ్రైవర్ రాజరుషి బిదావత్‌లను పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం జరగ్గా.. సాయంత్రం ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పోలీసులకు సహకరించకపోవడం వల్లే శివసేన నేత రాజేష్ షాను అరెస్టు చేసినట్లు చెప్పుకొచ్చారు. నిందితుడు రాజకీయ నేత కుమారుడు కావడంతో ఒక్కసారిగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. ఇకపోతే, నిందితుడిపై కొత్త క్రిమినల్ కోడ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం.. నేరపూరిత హత్య, ర్యాష్ డ్రైవింగ్, సాక్ష్యాలు నాశనం చేయడం లాంటి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారు రాజేష్ షా పేరుతో ఉండటంతో పాటు ప్రమాదం జరిగాక నిందితులు సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ట్రై చేసినట్లు విచారణలో తేలింది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?