Cyclone Asna: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం ఉదయం తుఫాన్ గా మారింది.. దీంతో గత కొన్ని రోజులుగా గుజరాత్ రాష్ట్రంలో కుండపోత వర్షాలకు కారణమైంది అని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
Water Level in Reservoirs: భారత దేశంలోని జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పెరిగిపోయాయి. గత సంవత్సరం ఇదే టైంతో పోల్చితే రిజర్వాయర్లలో నీటి నిల్వలు 126 శాతం అధికంగా నమోదైనట్లు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తెలిపింది.
BSNL New Plans: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్150 రోజుల వ్యాలిడిటీతో రూ.397 ప్లాన్‌ను మరోసారి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు రోజుకు 2జీబీ డేటా పొందే అవకాశం కల్పించింది. ఈ ప్లాన్ పాతాది అయినప్పటికి.. ప్రయోజనాలలో కొన్ని మార్పులు జరిగినట్లు సమాచారం. రూ.397లతో రీఛార్జ్ చేస్తే.. ఐదు నెలల వరకు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది.
స్మైల్ పే అనే పేరుతో కొత్త తరహా పేమెంట్ విధానానికి ఫెడరల్ బ్యాంక్ శ్రీకారం చుట్టింది. దీంతో వినియోగదారుల ఫేస్ రికగ్నైజేషన్‌తో ద్వారా చెల్లింపులు చేయొచ్చు. అంటే స్మార్ట్‌ఫోన్, గ్యాడ్జెట్స్‌తో పనుండదు. కేవలం రెండు దశల్లోనే ఈ చెల్లింపులు పూర్తి చేయొచ్చు. యూఐడీఏఐకి చెందిన భీమ్ ఆధార్ పేతో రూపొందించిన అధునాతన ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీనే ఈ స్మైల్ పే..బ్యాంక్ మర్చంట్స్ తమ మొబైల్లో ఫెడ్ మర్చెంట్ అప్లికేషన్‌లోని పేమెంట్ ఆప్షన్లలో ఉండే స్మైల్ పే ఆప్షన్‌ను ఎంచుకొని ఈ సేవలు పొందొచ్చు.
Shaheen Afridi: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాన పేసర్ షాహిన్ షా ఆఫ్రిదిపై వేటు పడటం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. కెప్టెన్ షాన్ మసూద్‌తో దురుసుగా ప్రవర్తించడంతో పాటు డ్రెసింగ్‌రూంలో వాతావరణం దెబ్బ తీసినందుకే అతడిని టీమ్ నుంచి తప్పించారనే ప్రచారం వస్తుంది.
ENG vs WI: ఇంగ్లాండ్ లోని లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ యువ ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్ అద్భుతమైన శతకంతో చెలరేగిపోయాడు. ఇప్పటి వరకు తన బౌలింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించిన ఈ యంగ్ ప్లేయర్.. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపించాడు.
Piyush Goyal: భారతదేశ కంపెనీలు ఒకదాని వస్తువులు మరొకటి కొనుగోలు చేస్తూ సపోర్టుగా నిలవాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ తెలిపారు. దీని వల్ల కరోనా మహమ్మారి లాంటి అవాంతరాలను ఎదుర్కోవచ్చు అన్నారు.
Banking Liquidity: ఆగస్టు నెలలో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ గణనీయంగా తగ్గి పోయిందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికలో వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలో (ఆగస్టు 2న) బ్యాంకింగ్ లిక్విడిటీ 2. 86 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఇది ఆగస్టు 16వ తేదీ నాటికి 1.55 లక్షల కోట్ల రూపాయలకు తగ్గిపోయింది.
Paralympics 2024: ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్-2024లో భారత్ పతకాల ఓపెన్ చేసింది. భారత పారా షూటర్ అవని లేఖరా పసిడి పతకం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో 249.7 స్కోరు సాధించి అగ్రస్థానంలో అవని నిలిచి.. గోల్డ్‌మెడల్‌ను తన ఖాతాలో వేసుకుంది.