PM Modi: నేడు మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
- నేడు మూడు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని..
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి స్టార్ట్ చేయనున్న మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ (శనివారం) మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. మూడు రైళ్లలో రెండు సర్వీసులు దక్షిణ రైల్వే జోన్‌కు సంబంధించినవి ఉండగా.. అవి, తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్- నాగర్‌కోయిల్, మదురై- బెంగళూరు కంటోన్మెంట్ మధ్య నడవనున్నాయి. చెన్నై సెంట్రల్, మదురై జంక్షన్ స్టేషన్లలో వేడుకలు జరగనున్నాయి. మూడో రైలు.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్- లక్నో మధ్య నడవనుంది.
Read Also: Israeli Strike : గాజాలో వైద్య సహాయం తీసుకువెళుతున్న కాన్వాయ్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి
Also Read
- Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
- Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
అయితే, దక్షిణ రైల్వే జోన్‌లో నడవనున్న మూడు కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారు. చెన్నై ఎగ్మోర్-నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20627/20628) రైలు బుధవారాలు మినహా వారానికి ఆరు రోజుల పాటు నడుస్తుంది. చెన్నై ఎగ్మోర్, తాంబరం, విల్లుపురం, తిరుచ్చిరాపల్లి, దిండిగల్, మదురై, కోవిల్‌పట్టి, తిరునెల్వేలితో పాటు నాగర్‌కోయిల్ జంక్షన్‌లలో ఈ రైలు ఆగుతుంది. చెన్నై ఎగ్మోర్ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకు నాగర్‌కోయిల్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో నాగర్‌కోయిల్‌లో మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు చెన్నై ఎగ్మోర్ స్టేషన్ కు చేరుకుంటుంది. చైర్ కార్ ధర రూ. 1,760 కాగా.. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ. 3,240. క్యాటరింగ్ ఛార్జీలతో కలిపి ఈ ప్రైస్ ఉంటుంది.
Read Also: Off The Record : జంపింగ్స్తో వైసీపీ ఉక్కిరి బిక్కిరి
ఇదిలా ఉండగా మదురై-బెంగళూరు కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20671/20672) రైలు సర్వీస్ మంగళవారం మినహా వారానికి ఆరు రోజుల పాటు తన సేవలను అందిస్తుంది. ఇది దిండిగల్, తిరుచ్చిరాపల్లి, కరూర్, నమక్కల్, సేలం, కృష్ణరాజపురంలలో ఆగుతుంది. దక్షిణ రైల్వే షెడ్యూల్ ప్రకారం.. రైలు మదురై జంక్షన్ నుంచి ఉదయం 5.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు కంటోన్మెంట్ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి రాత్రి 9.45 గంటలకు మధురై చేరుకుంటుంది. ఒక చైర్ కార్ ధర రూ. 1,575, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీ రూ. 2,865. క్యాటరింగ్ ఛార్జీలతో కలిపి ఉంటుంది.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!