West Bengal BJP: ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచార, హత్య ఘటనకు ప్రధాన కారణం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీయేనని బెంగాల్ అసెంబ్లీలో విపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపణలు చేశారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్, ఫరక్కాబాద్ లాంటి ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి.. మహిళలపై నేరాల విషయంలో యూపీ ముందువరసలో ఉందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సరిగ్గా పని చేయకపోవడంతో మహిళలపై వేధింపులు భారీగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Mehabooba Mufti: శ్రీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సభలో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు.
Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) స్కాం కలకలం రేపుతుంది. ఈ వ్యవహారంలో తనను విచారించేందుకు గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ పర్మిషన్ ఇచ్చారు.. దానికి తాను ఆందోళన చెందుతున్నానంటూ విపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sandip Ghosh: పశ్చిమ బెంగాల్ లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌ను సీబీఐ అధికారులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులో ఈ చర్య తీసుకున్నారు.
PM Modi @ Brunei: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు (మంగళవారం) బ్రూనై దేశానికి చేరుకున్నారు. మోడీకి ఆ దేశ క్రౌన్ ప్రిన్స్, హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ హాజీ అల్-ముహతాదీ బిల్లాహ్ ఘన స్వాగతం పలికారు.
Liquor Policy Scam: ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి సీబై దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఢిల్లీ హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు దుర్గేష్ పాఠక్‌లకు సమన్లను జారీ చేసింది.
Bengal Assembly: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన తీవ్ర ప్రకంపనలు రేపుతుంది. దీంతో పెద్ద ఎత్తున విమర్శల రావడంతో.. అసెంబ్లీలో ఇవాళ (మంగళవారం) బెంగాల్ సర్కార్ హత్యాచార నిరోధక బిల్లును తీసుకొచ్చింది.
Congress: కుల గణనను ఎన్నికల్లో లబ్ధి కోసం రాజకీయ ఉపకరణంగా వినియోగించరాదని ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు.
AP and Telangana Rains LIVE UPDATES: వాయుగుండం కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం వాయుగుండం వాయవ్యంగా పయనిస్తోంది. ఉత్తరాంధ్ర మీద ఆవరించి బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.